దేశవ్యాప్తంగా ఎంట్రీ ఆపరేషన్(ఒక రకమైన హవాలా) పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నవారి ఇళ్లు, కార్యాలయాల్లో మంగళవారం నుంచి ఐటీ శాఖ సోదాలు కొనసాగిస్తోంది. హవాలా ఆపరేటర్ సంజయ్ జైన్, అతని సంబంధీకుల నుంచి లెక్కలు చూపని రూ. 62 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది.
![Income Tax Dept has seized Rs 62 crores cash from entry operator Sanjay Jain and his beneficiaries](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9338673_it.jpg)
2016 నవంబర్ 8న చేసిన నోట్ల రద్దు తర్వాత దేశ రాజధాని ప్రాంతం దిల్లీలో నగదు జప్తు చేసినవాటిల్లో ఇది భారీ మొత్తమని అధికారులు తెలిపారు. దిల్లీ సహా పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్, గోవాల్లో 42 చోట్ల సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా ఐటీ దాడులు- భారీగా నగదు జప్తు