"అవును మా పూర్వీకుల నుంచి పాములు పెంచుతూ వస్తున్నాం. ఇవి మా జీవితంలో భాగమే. ఇక్కడ దాదాపు 250 ఇళ్లలో పాములు పెంచుతున్నారు. కానీ ప్రభుత్వం కొన్ని షరతులు విధించడం వల్ల కొంత మంది పెంచడంలేదు. మేము వీటికి మంత్రం వేస్తాము అందుకే అవి మమ్మల్ని కాటేయవు. మా ఇళ్లకు తలుపులు ఉండవు. పాములకు భయపడి దొంగలెవరూ ఇటు వైపు రారు."
-తేజ్పాల్ నాథ్, గ్రామస్థుడు
ఇక్కడ నాగులు సందడిగా తిరుగుతూ ఉంటాయి తప్ప, ఎవ్వరికీ ఎలాంటి హాని కలుగజేయవు. యజమానులు వారి పాములకు ప్రేమగా స్నానం చేయించి లాలిస్తారు. అవి రాత్రి పూట ఎలుకలు, కప్పలు తినేసి కడుపు నింపుకుంటాయి.
"నేను పుట్టినప్పటి నుంచి పాములను చూస్తునే ఉన్నాను. వీటిని పిల్లలకంటే ఎక్కువగా చూసుకుంటాం. ఒక సారి నన్ను కాటేసింది. మా దగ్గరుండే నాలుగు గోలీలు వేసుకుంటే తగ్గిపోయింది. రాత్రి పూట వీటిని వదిలేస్తాము. అవి ఇంట్లోనే తిరుగుతూ ఉంటాయి."
-బస్తీ వాసి.
పాములను చూస్తే ఆమడదూరం పారిపోయేవారికి.. విషపూరితమైన మూగ జీవాలను సైతం ఎలా మచ్చిక చేసుకోవచ్చో ఈ ఊరి ప్రజలు తెలియజేస్తున్నారు.
ఇదీ చూడండి: