ETV Bharat / bharat

భారత గబ్బిలాల్లో కరోనా వైరస్‌ - Indian Bats

ప్రపంచ వ్యాప్తంగా మానవాళికి పెనుముప్పులా మారింది కరోనా వైరస్​. మనుషులకే కాకుండా జంతువులు కూడా వైరస్​ బారిన పడుతున్నాయి. తాజాగా భారత్​లో నివసించే గబ్బిలాలకు మహమ్మారి సోకినట్లు గుర్తించారు అధికారులు. రెండు రకాల గబ్బిలాల్లో వైరస్ కనిపించినట్లు పేర్కొన్నారు.

In a First, Coronaviruses Found in Two Species of Indian Bats: ICMR-NIV Study
భారత గబ్బిలాల్లో కరోనా వైరస్‌
author img

By

Published : Apr 15, 2020, 8:01 AM IST

భారత్‌లో నివసించే రెండు రకాల గబ్బిలాల్లో కరోనా వైరస్‌ కనిపించింది. వీటిలో ఈ సూక్ష్మజీవులను గుర్తించడం ఇదే మొదటిసారి. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌), పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది.

ఈ రెండు రకాల గబ్బిలాలను ఇండియన్‌ ఫ్లయింగ్‌ ఫాక్స్‌, రౌసెటస్‌గా పిలుస్తారు. కేరళ, తమిళనాడు, హిమాచల్‌ ప్రదేశ్‌, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని ఈ రెండు జాతులకు చెందిన 25 గబ్బిలాల నుంచి నమూనాల్లో కరోనా వైరస్‌ జాడ కనిపించింది. ఈ వైరస్‌ నిర్ధారణకు ఉపయోగించే ‘రివర్స్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ చైన్‌ రియాక్షన్‌’ (ఆర్‌టీ-పీసీఆర్‌) పరీక్షలు నిర్వహించినప్పుడు ‘పాజిటివ్‌’ ఫలితాలు వచ్చాయి. అయితే ఈ రకం కరోనా వైరస్‌ వల్ల మానవుల్లో ఇన్‌ఫెక్షన్లు కలుగుతాయా అన్నది ఇప్పుడే చెప్పలేమని పరిశోధకులు తెలిపారు.

2018, 2019 సంవత్సరాల్లో తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌, ఒడిశా, చండీగఢ్‌, పుదుచ్చేరిల్లోని అడవుల్లో గబ్బిలాలపై ఈ పరిశోధన నిర్వహించారు. ఐతే కేరళలోని రౌసెటస్‌ గబ్బిలాల నుంచి సేకరించిన నాలుగు నమూనాల్లోను, పుదుచ్చేరి, హిమాచల్‌ ప్రదేశ్‌, తమిళనాడులోని ఇండియన్‌ ఫ్లయింగ్‌ ఫాక్స్‌ గబ్బిలాల నుంచి సేకరించిన 21 నమూనాల్లో మాత్రమే కరోనా వైరస్‌ కనిపించింది. తెలంగాణ సహా మిగతా రాష్ట్రాల నుంచి సేకరించిన నమూనాల్లో ఈ వైరస్‌ జాడలేదు. గబ్బిలాల్లోని రోగ నిరోధక వ్యవస్థ భిన్న రకాల వైరస్‌లను తిప్పికొట్టగలదని అధ్యయనంలో వెల్లడైంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.