జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటుపై డాక్టర్లు, వైద్య విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కమిషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఆగస్టు 8న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది భారత వైద్య మండలి (ఐఎంఏ). ఆ రోజు ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు 6గంటల వరకు నిరాహార దీక్ష చేపట్టాలని కోరింది.
భారతీయ వైద్య మండలి(ఎంఐఏ) స్థానంలో జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) బిల్లును తీసుకొచ్చింది కేంద్రం. ఈ బిల్లుకు ఇటీవలే పార్లమెంటులో ఆమోదం లభించింది. బిల్లును వ్యతిరేకిస్తూ డాక్టర్లు, వైద్య విద్యార్థులు నిరసనలు. కార్పొరేట్ ఆస్పత్రులకు మేలు చేసేందుకే కొత్త బిల్లు తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు. వైద్య విద్యలో ఇదో గొప్ప సంస్కరణగా నిలిచిపోతుందని తెలిపారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్.
ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా వైద్యం బంద్- రోగుల ఇక్కట్లు