భారతీయ వైద్య మండలి(ఐఎంఏ) స్థానంలో తీసుకొస్తున్న జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) బిల్లును వ్యతిరేకిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బుధవారం వైద్యసేవల బంద్‌కు పిలుపునిచ్చింది. అత్యవసర సేవలు మినహా మిగతా వైద్యులు, వైద్య విద్యార్థులు ఈ బంద్‌లో పాల్గొననున్నారు. బుధవారం ఉదయం 6 గంటలనుంచి స్వచ్ఛందంగా బంద్ పాటించనున్నారు. ఎన్ఎంసీ బిల్లు సోమవారమే లోక్‌సభలో ఆమోదం పొందింది.
ఈ బిల్లును నిరసిస్తూ సోమవారం 5వేల మంది డాక్టర్లు, వైద్య విద్యార్థులు దిల్లీ వేదికగా నిరసన తెలిపారు. వైద్యవిద్యలో సంస్కరణల కోసం ప్రవేశపెట్టిన ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా దిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి ర్యాలీగా వెళ్లి నిర్మాణ్ భవన్‌ను ముట్టడించారు.
ఐఎంఏ విధానాలు పేదలకు, విద్యార్థులకు వ్యతిరేకంగా ఉన్నాయని పేర్కొంటూ సంస్కరణలు చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత విధానంలో సంస్కరణలు సరిగా జరగలేదని వాదిస్తోంది.
ఇదీ చూడండి: జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం