ఉత్తరప్రదేశ కాన్పూర్‌కు చెందిన ఐఐటీ నిపుణులు రైళ్లలో వృద్ధులకు ఊరట కల్గించేలా ఓ కొత్త ఆవిష్కరణ చేశారు . మధ్య, పైన బెర్త్‌లను వృద్ధులు తేలికగా ఎక్కడానికి వాటికి మెట్లను జోడించారు.
మన రైళ్లలో బెర్త్ దొరకడమే కష్టం. మధ్యలో, పైన ఉండే బెర్త్‌లను పెద్దవారు ఎక్కాలంటే మరింత కష్టం. అయితే ఇక ఈ సమస్య పరిష్కారం కానుంది. ఐఐటీ కాన్పూర్ నిపుణులు భారతీయ రైల్వే కోసం మెట్లతో కూడిన సీట్లను రూపొందించారు. వీటిపై కాళ్లు పెట్టి సులభంగా పైకి వెళ్లొచ్చు.
ఇదీ చూడండి : ఆర్థిక వ్యవస్థ కుప్పకూలినా మౌనమేల మోదీ?: చిదంబరం