రంజాన్ మాసంలో మత సామరస్యానికి వేదికైంది ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య. నగరంలోని ఓ సీతారామాలయంలో అర్చుకుడు ఇఫ్తార్ విందు ఇచ్చారు.
ఆలయంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు అన్ని మతాల వారు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఇది మూడోసారి అని తెలిపారు అర్చకుడు యోగల్ కిషోర్. మతభేదాలు లేకుండా ప్రజలందరూ అన్ని పండుగలను జరుపుకోవాలన్నారు.
ఇఫ్తార్ విందుకు హాజరైన ముస్లింలు యోగల్పై ప్రశంసల వర్షం కురిపించారు. మతాల పేరుతో రాజకీయాలు జరుగుతున్న సమయంలో ఇలాంటి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ప్రపంచానికి మంచి సందేశాన్నిస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: ధోనిని తలపించిన ఇంగ్లాండ్ క్రికెటర్లు