136 కోట్ల జనాభా కలిగిన మన దేశంలో ఇప్పటిదాకా కరోనా అనుమానిత పరీక్షలు జరిపింది లక్షన్నర లోపే. దేశవ్యాప్తంగా ప్రభుత్వం ఆమోదం తెలిపిన 51 కేంద్రాల్లో పరీక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం రోజుకు 10 వేల పరీక్షలు చేస్తున్నారు.కరోనా అనుమానితుల్ని తక్షణం గుర్తించి.. వారికి నిర్ధారణ పరీక్షలు చేయడం, వేరుగా ఉంచి చికిత్సలు అందించడం ఇప్పుడు అత్యంత కీలకమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని ధనిక దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో పరీక్షల రేటు చాలా తక్కువగా ఉందని, ఈ సంఖ్యను గణనీయంగా పెంచితే తప్ప ఎందరికి వైరస్ సోకిందన్న విషయాన్ని కచ్చితంగా నిర్ధరించలేమని స్పష్టం చేస్తున్నారు.
![If you want to know if you are infected - Corona tests should increase!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6665837_virus.jpg)
ఎందుకు సవాలు?
ప్రపంచ వ్యాప్తంగా కిట్ల కొరత కరోనా పరీక్షల మందగమనానికి ఓ ప్రధాన కారణం. వీటికి అనుమతుల్లో జాప్యమూ కారణమవుతోంది.
- లాక్‌డౌన్, అంతర్జాతీయ విమానయానంపై నిషేధం కారణంగా సరిపడా ముడిసరకులూ దొరకడంలేదు. నమూనాలను పరీక్షల కేంద్రాలకు తీసుకెళ్లడంలోనూ ఆలస్యమవుతోంది.
- ఎఫ్‌డీఏ(అమెరికా), సీఈ(యూరప్)లు ధ్రువీకరించిన కిట్లను మాత్రమే వాడాలంటూ మొదట భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) స్పష్టంచేయడంతో భారతీయ కంపెనీల చేతులు కట్టేసినట్లయింది. సమస్య తీవ్రత పెరుగడం వల్ల పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థ(ఎన్‌ఐవీ) ధ్రువీకరించిన కిట్లను సైతం అనుమతిస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఇప్పటివరకు పరీక్ష ఫలితం రావడానికి 6-7 గంటల సమయం పడుతుండగా తమ కిట్లతో అది 2.5 గంటలకు కుదించవచ్చని కంపెనీ తెలిపింది. జర్మనీకి చెందిన మరో కిట్‌కు సైతం అనుమతి లభించింది. మరో 14 కిట్లకు అనుమతిచ్చేందుకు పరీక్షిస్తున్నారు.ఎందరికి సోకిందో తెలియాలంటే.. కరోనా పరీక్షలు పెరగాలి!
ఇదీ చూడండి: ఇది ఆయుధాలు వాడని యుద్ధం: రవిశంకర్