ETV Bharat / bharat

'సిద్ధరామయ్య సీఎం అయితే అభ్యంతరం లేదు' - karnataka

కర్ణాటకలో రాజకీయ సంక్షోభాన్ని తొలగించేందుకు కాంగ్రెస్, జేడీఎస్​ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు రెండు పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ నిర్ణయాన్ని గౌరవిస్తామని జేడీఎస్​ ప్రకటించింది. సీఎంగా సీఎల్పీ నేత సిద్ధరామయ్యను కమిటీ సూచిస్తే తమకేమీ అభ్యంతరం లేదని జేడీఎస్​ స్పష్టం చేసింది.

'సిద్ధరామయ్య సీఎం అయితే అభ్యంతరం లేదు'
author img

By

Published : Jul 7, 2019, 8:58 PM IST

కర్ణాటకలో 14 ఎమ్మెల్యేల రాజీనామాతో కాంగ్రెస్, జేడీఎస్​ కూటమి ప్రభుత్వ మనుగడపై అనుమానాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో అవకాశం వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమేనని భాజపా ప్రకటనతో ఈ రెండు పార్టీల్లో మరింత గుబులు మొదలయింది. భాజపా ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు కాంగ్రెస్, జేడీఎస్​ పార్టీలు సమన్వయ కమిటీని నియమించాయి.

ప్రభుత్వాన్ని కాపాడునే దిశలో కమిటీ సూచించిన అంశాలను పాటిస్తామని జేడీఎస్​ సీనియర్​ నేత జీటీ దేవెగౌడ స్పష్టం చేశారు.

"సమన్వయ కమిటీ నిర్ణయాన్ని గౌరవిస్తాం. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి చేయాలని కమిటీ భావిస్తే అందులో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రభుత్వాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు కేబినెట్​ మంత్రులుగా ఉన్న సీనియర్లు రాజీనామా చేస్తారని ఆ పార్టీ తెలిపింది."

-జీటీ దేవెగౌడ, జేడీఎస్​ సీనియర్​ నేత

బెంగళూరుకు కుమారస్వామి

ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో అమెరికా పర్యటనను అర్ధంతరంగా ముగించి బెంగళూరు చేరుకున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి. తాజా పరిస్థితులపై చర్చించేందుకు బెంగళూరులోని తాజ్​ వెస్ట్ ఎండ్​ హోటల్​లో సమావేశం ఏర్పాటు చేశారు.

ఎమ్మెల్యేలకు సిద్ధరామయ్య హెచ్చరిక

రాష్ట్రంలోని పరిస్థితులపై చర్చించేందుకు మంగళవారం కాంగ్రెస్​ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు సీఎల్పీ నేత సిద్ధరామయ్య. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలందరూ హాజరు కావాలని అల్టిమేటం జారీ చేశారు. భేటీకి హాజరు కాని ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మరికొంత మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో సిద్ధరామయ్య ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

భాజపానే కారణం: కాంగ్రెస్

కర్ణాటకలో రాజకీయ సంక్షోభానికి భాజపానే కారణమని కాంగ్రెస్ సీనియర్​ నేతలు ఆరోపిస్తున్నారు.

"ఇదంతా భాజపానే చేయిస్తోంది. ప్రస్తుత పరిస్థితులకు వారి అధికారం, ధన బలమే కారణం. ఆ పార్టీలో చేరాలని ఎమ్మెల్యేలను భాజపా ప్రలోభపెట్టింది. రామలింగారెడ్డి లాంటి సీనియర్​ నేత రాజీనామా చేయటం నమ్మలేకపోతున్నా."

-సిద్ధరామయ్య, కర్ణాటక కాంగ్రెస్ ఎల్పీ నేత

ఇదీ చూడండి: 'పరిస్థితులు అనుకూలిస్తే ప్రభుత్వ ఏర్పాటు'

AP Video Delivery Log - 1400 GMT News
Sunday, 7 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1309: Greece Election Leaders 2 AP Clients Only 4219359
Opposition leaders, president vote in Greece
AP-APTN-1256: UK Ambassador Trump No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4219358
Former UK minister on ambassador to US leaked memo
AP-APTN-1237: France WWC Football AP Clients Only 4219353
Football fans prepare for Netherlands v USA in Lyon
AP-APTN-1214: Iran Nuclear 2 No access by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4219352
Iran says stopped tanker was not headed to Syria
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.