ETV Bharat / bharat

'రాహుల్.. మీ సీఎంలు ముందే అలా ఎందుకు చేశారు?' - B L Santhosh news

లాక్​డౌన్​పై రాహుల్​ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది అధికార భాజపా. లౌక్​డౌన్​ పరిష్కారం కాకుంటే కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాలు ముందే ఎందుకు పొడిగించాయని ప్రశ్నించింది.

BJP
రాహుల్​ గాంధీపై భాజపా విమర్శలు
author img

By

Published : Apr 16, 2020, 4:13 PM IST

కరోనా వైరస్​ కట్టడికి లాక్​డౌన్​ పరిష్కారం కాదన్న కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ వ్యాఖ్యలను తిప్పికొట్టింది భారతీయ జనతా పార్టీ. కేంద్ర ప్రభుత్వం లాక్​డౌన్​ పొడిగింపుపై ప్రకటన చేయకముందే.. కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు పొడిగించారని ప్రశ్నించింది.

BJP
బీఎల్​ సంతోష్​ ట్వీట్​

" రాహుల్​ గాంధీ ప్రకారం లాక్​డౌన్​ అనేది పరిష్కారం కాదు. అయితే కాంగ్రెస్​ భాగస్వామ్య ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుగానే ఎందుకు పొడిగించారు?"

- బీఎల్​ సంతోష్​, భాజపా ప్రధాన కార్యదర్శి.

లాక్​డౌన్​పై రాహుల్​ గాంధీ విమర్శల నేపథ్యంలో తన ట్విట్టర్​లో కరోనాకు సంబంధించిన పలు గణాంకాలు పోస్ట్​ చేసింది భాజపా. కొవిడ్​-19తో తీవ్రంగా ప్రభావితమైన దేశాలతో పోల్చితే ఈ మహమ్మారిని భారత్​ సమర్థంగా ఎదుర్కోగలిగిందని తెలిపింది. ఒక మిలియన్​ జనాభాకు కేవలం 9 కేసులు, 0.3 మరణాలు సంభవించాయని స్పష్టం చేసింది.

BJP
భాజపా ట్వీట్​

మహారాష్ట్ర, పంజాబ్​లో..

మే 3 వరకు లాక్​డౌన్​ పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయకముందే.. మహారాష్ట్రలో ఏప్రిల్​ 30 వరకు పొడిగించింది అక్కడి ప్రభుత్వం. కాంగ్రెస్​ అధికారంలో ఉన్న పంజాబ్​ కూడా ముందే నిర్ణయం తీసుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.