కేరళలో కురుస్తోన్న భారీ వర్షాలకు ఇడుక్కి రాజమలై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 16కు చేరింది. మరో 12 మందిని రక్షించి ఆసుపత్రులకు తరలించారు. ఇంకా 50 మంది ఆచూకీ లభించలేదు.
రాజమలైలోని పెట్టిముడి ప్రాంతం మొత్తం కొండలతో ఉంటుంది. అక్కడ 80 కుటుంబాలు నివసిస్తున్నాయి. బాధితుల్లో టీ తోటల్లో పని చేసే కూలీలే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మోదీ విచారం..
కొండచరియలు విరిగిపడి 16 మంది ప్రాణాలు కోల్పోవటంపై విచారం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ప్రమాదంలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి జాతీయ సహా నిధి ద్వారా రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు పరిహారం ప్రకటించారు మోదీ.
ఇదీ చూడండి: నదుల ఉగ్రరూపం- కొండ చరియలు విరిగి ప్రాణనష్టం