లద్దాఖ్‌లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని భాజపా ఘనంగా నిర్వహించింది. లేహ్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో భాజపా జమ్ముకశ్మీర్ వ్యవహారాల ఇన్‌ఛార్జి రామ్‌మాధవ్ జెండా ఆవిష్కరించారు. కశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దు తర్వాత జరిగిన మొదటి స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
"దేశంలో ఈ ఏడాది స్వాతంత్ర్య వేడుకలు ఎంతో ప్రత్యేకమైనవి. లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంగా మారినందున మరింత ప్రత్యేకం. లద్దాఖ్‌లో మొదటిసారి జెండా ఎగరేసినందుకు ఎంతో గర్వపడుతున్నా."
-రామ్‌మాధవ్, జమ్ము కశ్మీర్ భాజపా ఇన్‌ఛార్జి
రామ్‌మాధవ్‌తో పాటు స్థానిక ఎంపీ జమ్యాంగ్ షేరింగ్ నంగ్యాల్ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానికులతో కలిసి లద్దాఖ్ సంప్రదాయ నృత్యంతో అలరించారు. బృందంతో డోలు వాయిస్తూ తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు.
ఇదీ చూడండి: 70 ఏళ్ల కల సాకారం: లద్దాఖ్ ఎంపీ నంగ్యాల్