ETV Bharat / bharat

చైనా నుంచి భారత్​కు మరో వైరస్​ ముప్పు: ఐసీఎంఆర్​ - చైనాలో క్యాట్ క్యూ వైరస్

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి దేశంలో కలకలం సృష్టిస్తోంది. ఈ సమయంలో మరో చైనా వైరస్​ నుంచి ఆరోగ్య విపత్తు సంభవించే అవకాశం ఉందని ఐసీఎంఆర్​ హెచ్చరించింది. క్యూలెక్స్ దోమలు, పందులు వాహకాలుగా పనిచేసే 'క్యాట్​ క్యూ వైరస్​'.. మనుషుల్లో జ్వరం, తలనొప్పి, మెదడు వాపునకు కారణమవుతుందని తెలిపింది.

ICMR
చైనా వైరస్
author img

By

Published : Sep 29, 2020, 1:07 PM IST

చైనా నుంచి మరో వైరస్​ ముప్పును భారత్​ ఎదుర్కొనే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) హెచ్చరించింది. దీని పేరు 'క్యాట్​ క్యూ వైరస్' అని తెలిపింది. జ్వరం, తలనొప్పి సంబంధమైన అనారోగ్య లక్షణాలతో పాటు మెదడు వాపు వ్యాధి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఆర్దోపోడ్‌ వర్గానికి చెందిన జీవులను వాహకాలుగా వాడుకొని ఈ వైరస్‌ వ్యాపిస్తుందని ఐసీఎంఆర్​ తెలిపింది. చైనా, తైవాన్‌ వెలుగు చూసిన వైరస్.. క్యూలెక్స్‌ జాతి దోమలు, పందులను ఈ వైర్‌సలు ఆవాసాలుగా మార్చుకుంటాయని ​ ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది. మన దేశంలోనూ పందులు, క్యూలెక్స్ దోమలు క్యాట్‌ క్యూ వైరస్​కు ప్రాథమిక వాహకాలుగా పనిచేస్తాయని పేర్కొన్నారు.

ఇద్దరిలో యాంటీబాడీలు..

దేశవ్యాప్తంగా సేకరించిన 883 శాంపిళ్లలో రెండు నమూనాల్లో క్యాట్​ క్యూ వైరస్​కు ఐజీజీ యాంటీబాడీలు ఉన్నట్లు పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే శాంపిళ్లలో నేరుగా వైరస్‌ జాడను తాము గుర్తించలేదని ఎన్‌ఐవీ శాస్త్రవేత్తలు స్పష్టంచేశారు. ప్రస్తుతం ఈ వైరస్‌ ఎంతమందిలో ఉన్నది తెలియాలంటే.. మరిన్ని శాంపిళ్లను పరీక్షించాల్సి ఉంటుందన్నారు.

వీటితోపాటు ఏజిప్టీ, క్యూలెక్స్‌ క్విన్‌క్వేఫాషియేటస్‌, క్యూలెక్స్‌ ట్రైటేనియోరైన్‌కస్‌ జాతుల దోమల ద్వారా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించొచ్చని ఐసీఎంఆర్‌ అధ్యయనంలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో మనుషులతో పాటు పందులు, ఇతర జంతువుల శాంపిళ్లనూ సేకరించి పరీక్షిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: 'కరోనా పరీక్షలు, టీకా కోసం 3500 కోట్ల డాలర్లు అవసరం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.