ETV Bharat / bharat

గుడ్​న్యూస్: ఆగస్టు 15 కల్లా మార్కెట్లోకి కొవాక్జిన్​! - కోవాక్సిన్ విడుదల తేదీ

కొవాక్జిన్​ క్లినికల్ ట్రయల్స్​ను వేగవంతం చేయాలని భారత్​ బయోటెక్ సంస్థకు ఐసీఎంఆర్​ సూచించింది. ఈ మేరకు ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ లేఖ రాశారు. ఈ వ్యాక్సిన్ మనుషులపై ప్రభావవంతంగా పనిచేస్తే ఆగస్టు 15లోపు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావచ్చని స్పష్టం చేసింది.

COVID-19 vaccine
కోవ్యాక్సిన్
author img

By

Published : Jul 3, 2020, 10:41 AM IST

Updated : Jul 3, 2020, 8:38 PM IST

కరోనా వైరస్​కు భారత్​ బయోటెక్​ అభివృద్ధి చేసిన కొవాక్జిన్​​ను ఆగస్టు 15 కల్లా విడుదల చేయాలని ఐసీఎంఆర్ భావిస్తోంది. ఇందుకు సంబంధించి పరీక్షలను వేగవంతం చేయాలని భారత్​ బయోటెక్​తోపాటు సంబంధిత వైద్య కళాశాలకు ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ లేఖ రాశారు.

ఇందుకోసం భారత్ బయోటెక్​తో కలిసి పనిచేయనున్నట్టు బలరాం పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన వ్యాక్సిన్ విడుదల ప్రాథమిక అంశంగా పరిగణించాలని, ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని వ్యాక్సిన్ తయారీలో భాగస్వాములందరికీ తెలియజేశారు బలరాం.

ICMR
బలరాం లేఖ

సన్నద్ధమవ్వాలి..

భారత్​ బయోటెక్​తో పాటు ఎంపిక చేసిన కేంద్రాలు క్లినికల్ ట్రయల్స్​కు సన్నద్ధమవ్వాలని సూచించారు భార్గవ. త్వరితగతిన ట్రయల్స్​ను పూర్తి చేసి, ఫలితాల వివరాలను అందించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఈ వ్యాక్సిన్​ కరోనాను నివారించగలిగితే ఆగస్టు 15 కల్లా మార్కెట్లోకి త్వరగా తీసుకువచ్చేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.

ఐసీఎంఆర్, పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ వైరాలజీ సహకారంతో కరోనా వైరస్ వ్యాక్సిన్​ను భారత్​ బయోటెక్ అభివృద్ధి చేసింది. కొవాక్జిన్​​కు డ్రగ్​ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతితో క్లినికల్ ట్రయల్స్​ను జులై నెలలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది భారత్ బయోటెక్.

సవాళ్లతో కూడుకున్న పనే!

కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్​ను అందుబాటులోకి తీసుకురావాలని ఐసీఎంఆర్​ భావిస్తున్నా... ఆచరణసాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. ఈ ఏడాది చివరినాటికి మార్కెట్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.

Last Updated : Jul 3, 2020, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.