ETV Bharat / bharat

జన్​ధన్​ ఖాతాదారులకు నగదు బదిలీకి కేంద్రం ఆదేశాలు - జన్​ధన్​ రూ.500

పీఎం గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ కింద జన్​ధన్​ యోజన మహిళా ఖాతాదారులకు ఏప్రిల్​కు సంబంధించిన నగదు బదిలీ చేయాలని కేంద్రం ఆదేశించింది. కేవైసీ పత్రాలు లేవన్న కారణంతో చిన్న ఖాతాలను స్తంభింపజేయవద్దని కోరింది.

jan dhan
జన్​ధన్
author img

By

Published : Apr 2, 2020, 6:28 AM IST

లాక్​డౌన్​ నేపథ్యంలో 'పీఎం గరీబ్ కల్యాణ్' ప్యాకేజీ కింద జన్​ధన్​ యోజన మహిళా ఖాతాదారులకు ఏప్రిల్​కు సంబంధించిన రూ.500 నగదును బదిలీ చేయాలని బ్యాంకర్లను కేంద్రం ఆదేశించింది. ఈ నెల 3-9 తేదీల మధ్య ఆయా ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఆ తేదీ తర్వాత లబ్ధిదారులు ఈ సొమ్మను తీసుకోవచ్చు.

కేవైసీ పత్రాలు లేవన్న కారణంతో చిన్న ఖాతాలను స్తంభింపజేయవద్దని, వాటిని వెంటనే వాడుకలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.