ఈశాన్య దిల్లీలోని చాంద్‌బాగ్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ మృతదేహం లభించడం తీవ్ర కలకలం రేపింది. దిల్లీ అల్లర్లలో భాగంగా జరిగిన రాళ్ల దాడిలోనే అంకిత్ ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గురు తేగ్ బహదూర్ ఆసుపత్రికి తరలించారు. నివేదిక వచ్చాకే అంకిత్ మృతికి కారణాలపై స్పష్టత వచ్చే అవకాశముంది.
![IB staffer found dead in Delhi's riot-hit Chand Bagh area](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6209103_ib.jpg)
ఈనెల 23న పౌరసత్వ చట్ట సవరణ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో 20మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 150మందికిపైగా ప్రజలు గాయపడ్డారు. క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఇదీ చూడండి:- 'అల్లర్లకు కేంద్రానిదే బాధ్యత- షా రాజీనామా చేయాలి'