ETV Bharat / bharat

భారత్​కు మరో మూడు  రఫేల్​ యుద్ధవిమానాలు - రఫేల్ యుద్ధ విమానాల వార్తలు

ఫ్రాన్స్​ నుంచి రెండో విడతగా మరో మూడు రఫేల్​ యుద్ధవిమానాలు భారత్​కు రానున్నాయి. ఇప్పటికే తొలి విడతగా 5 జెట్లు రాగా.. నవంబర్​ 4న మూడు రఫేల్ యుద్ధవిమానాలు భారత్​కు చేరుకోనున్నాయి. ఫ్రాన్స్​ ఇస్​ట్రెస్​ నుంచి నాన్​స్టాప్​గా ప్రయాణించి జామ్​నగర్​కు వస్తాయని అధికార వర్గాలు తెలిపాయి.

Rafale combat aircraft
రఫేల్
author img

By

Published : Nov 3, 2020, 7:41 AM IST

భారత్​కు రెండో బ్యాచ్‌ రఫేల్​ యుద్ధ విమానాలు నవంబర్​ 4వ తేదీన చేరుకోనున్నాయి. ఈ విడతలో మూడు జెట్లు రానున్నాయి. ఇవి ఫ్రాన్స్​లో ఇస్​ట్రెస్​ నుంచి నేరుగా జామ్​నగర్​కు వస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఫ్రాన్స్​ నుంచి మొత్తం 8 గంటలపాటు నాన్​స్టాప్​గా ప్రయాణించి భారత్​కు చేరుకుంటాయి. ఈ మూడు రఫేల్​ జెట్లకు మార్గం మధ్యలో ఫ్రెంచి వాయుసేన ఇంధనాన్ని నింపనుంది. ఇవి భారత్​కు చేరితే మొత్తం 8 రఫేల్​ యుద్ధ విమానాలు అందుబాటులో ఉంటాయి.

ప్రత్యేక శిక్షణకు బృందం..

ఇప్పటికే భారత వాయుసేన గతనెలలో యుద్ధ విమానాల రవాణా, పైలట్లకు శిక్షణ కోసం ఒక బృందాన్ని ఫ్రాన్స్‌కు పంపింది. దీనికి అసిస్టెంట్ చీఫ్​ ఆఫ్ ఎయిర్​స్టాఫ్ నేతృత్వం వహిస్తున్నారు.

భారత్​, ఫ్రాన్స్​ మధ్య 36 రఫేల్ జెట్ల కోసం రూ.59వేల కోట్ల ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా తొలి విడతగా ఈ ఏడాది జులై 29న 5 యుద్ధ విమానాలు భారత్​లోని అంబాలా వాయుస్థావరానికి చేరాయి. ప్రస్తుతం 3 వస్తుండగా.. మరో 28 జెట్లను 2021 చివరి నాటికి ఫ్రాన్స్ అందించనుంది.

ఇదీ చూడండి: భారత గడ్డపై రఫేల్-​ అంబాలా చేరిన శత్రు భీకర జెట్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.