ETV Bharat / bharat

'స్కై డైవ్'​లో వాయుసేన జవాన్ల సరికొత్త రికార్డ్ - స్కై డైవ్​

భారత వాయుసేన 88వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని అత్యంత ఎత్తయిన ప్రాంతంలో స్కై డైవ్​​ చేపట్టి సరికొత్త రికార్డు నెలకొల్పారు జవాన్లు. 17,982 అడుగుల ఎత్తయిన ఖర్దుంగ్లా పాస్​లో ల్యాండ్​ అయి.. వారి గత రికార్డులను తిరగరాశారు. ​

IAF sets new record
భారత వాయుసేన
author img

By

Published : Oct 10, 2020, 5:29 AM IST

భారత వాయుసేనకు చెందిన ఇద్దరు జవాన్లు లేహ్​లోని అత్యంత ఎత్తైన ప్రదేశంలో సవాళ్లతో కూడుకున్న వాతావరణంలో స్కై డైవ్​​ చేసి సరికొత్త రికార్డ్​ నెలకొల్పారు. వాయుసేన 88వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా అక్టోబర్​ 8న సీ-130జే విమానం నుంచి డైవ్​ చేసి ఈ విన్యాసాలు చేపట్టారు.

  • #WATCH: Wg Cdr Gajanad Yadava & Warrant Officer AK Tiwari create new record of highest skydive landing at Khardungla Pass, Leh at altitude of 17982 ft, breaking their own record. They carried out the jump from C-130J aircraft on Oct 8, to celebrate 88th Air Force Day.(Source:IAF) pic.twitter.com/nLbEAWMp2m

    — ANI (@ANI) October 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

వింగ్​ కమాండర్​ గజనాద్​ యాదవ్​, వారంట్​ ఆఫీసర్​ ఏకే తివారీలు.. లేహ్​లోని ఖర్దుంగ్లా పాస్​లో ఈ ఫీట్​ చేసి ఔరా అనిపించారు. 17,982 అడుగుల ఎత్తయిన ప్రాంతం ఖర్దుంగ్లా పాస్​లో స్కై డైవ్​ ల్యాండింగ్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పినట్లు వాయుసేన వెల్లడించింది.

" కనిష్ఠ స్థాయిలో ఆక్సిజన్, గాలి సాంద్రత తక్కువగా ఉండే ఇలాంటి ఎత్తయిన ప్రాంతంలో స్కై డైవ్​ ల్యాండింగ్​ చేయటం అత్యంత సవాలుతో కూడుకున్న అంశం. ఇరువురు వీరులు ప్రతికూల పరిస్థితులను అధిగమించటంలో అద్బుతమైన నైపుణ్యం, సంకల్పాన్ని చూపించారు. సరికొత్త ఐఏఎఫ్​ రికార్డును నెలకొల్పడంలో గొప్ప విజయాన్ని సాధించారు."

- భారత వాయుసేన.

ఇదీ చూడండి: తొలి యాంటీ రేడియేషన్ క్షిపణి 'రుద్రం' ప్రయోగం సక్సెస్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.