ETV Bharat / bharat

లేహ్​లో రాత్రివేళలోనూ యుద్ధవిమానాల గర్జన - iaf in leh news

చైనాతో సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది భారత వాయుసేన. లేహ్​లో రాత్రివేళలోనూ యుద్ధవిమానాలతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మన పైలట్లు శత్రువుతో పాటు కఠినమైన పరిస్థితులను ఎదుర్కోగల సమర్థవంతులని అధికారిక వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి.

iaf-airbase-in-leh-fully-equipped-for-taking-every-challenge-in-night
లేహ్​లో రాత్రివేళలోనూ యుద్ధవిమానాల గర్జన
author img

By

Published : Oct 12, 2020, 10:31 AM IST

సరిహద్దులో ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉంది భారత వాయుసేన. రాత్రివేళలోనూ లేహ్​ సరిహద్దులో యుద్ధ విమానాలతో గస్తీ నిర్వహిస్తోంది. శత్రువులు ఏ సమయంలో దుశ్చర్యలకు పాల్పడినా దీటుగా తిప్పికొట్టేందుకు సిద్ధమైంది.

మిగ్​-29, అపాచీ, చినూక్​, ఎంఐ-17, తేలికపాటి ధ్రువ్ యుద్ధ విమానాలు లేహ్ ఎయిర్​బేస్ వద్ద రాత్రివేళ చక్కర్లు కొడుతున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

"పరిస్థితులు ఏవైనా రాత్రివేళ కూడా యుద్ధవిమానాలను రంగంలోకి దింపేందుకు సిద్ధం. శిక్షణ పొందిన మన పైలట్లకు నైపుణ్యంతో పాటు వృత్థి నిబద్ధత కూడా ఎక్కువ. ఈ ప్రాంతంలో చీకటి వేళలోనూ ఆపరేషన్ నిర్వహించగలరు." అని భారత వాయుసేన అధికారి తెలిపారు.

లేహ్​ ప్రాంతంలో రాత్రివేళ కార్యకలాపాలు నిర్వహించడం అంత సులభం కాదు. మిగతా ప్రాంతంతో పోల్చితే ఈ భూభాగం పూర్తిగా భిన్నం. ఎత్తైన ప్రదేశాలు, ఆక్సిజన్​ కొరత, అతి తక్కువ ఉష్ణోగ్రత వంటి క్లిష్ట పరిస్థితులుంటాయి. ఈ శిఖరాల్లో చీకటి వేళ కార్యకలాపాలు నిర్వహించడమే అతిపెద్ద సవాల్​. అయితే భారత వాయుసేన పైలట్లు శత్రువుతో పాటు కఠిన పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు.

వీటితో పాటు శీతాకాలంలో కురిసే మంచువల్ల దృశ్యమానత పరంగా ఎదురయ్యే కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు వాయుసేన సన్నద్దమవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.