ETV Bharat / bharat

ఉద్రిక్తతల వేళ లద్దాఖ్​లో వైమానిక దళాధిపతి - India China standoff

భారత వాయుసేన సారథి భదౌరియా.. బుధవారం లద్దాఖ్​లోని వైమానిక స్థావరాన్ని సందర్శిచారు. అక్కడ జరుగుతున్న కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. చైనాతో సరిహద్దులో యుద్ధమేఘాలు అలుముకున్న నేపథ్యంలో భదౌరియా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

IAF chief reviews operational preparedness of frontline air bases amid standoff with China
యుద్ధ సన్నద్ధతపై వైమానిక దళాధిపతి సమీక్ష
author img

By

Published : Sep 3, 2020, 4:48 PM IST

చైనాతో సరిహద్దులో యుద్ధమేఘాలు అలుముకున్న నేపథ్యంలో భారత వాయుసేన సారథి రాకేశ్​ కుమార్​ సింగ్​ భదౌరియా.. ఈఏసీ(ఈస్టర్న్​ ఎయిర్​ కమాండ్​)లోని వైమానిక స్థావరాన్ని సందర్శించారు. యుద్ధసన్నద్ధతపై సమీక్షించారు.

బుధవారం జరిగిన ఈ పర్యటనలో భాగంగా వాయుసేన పైలట్లను కలిసి వారితో పలు కీలక విషయాలపై భదౌరియా మాట్లాడారు. అనంతరం ఎయిర్​బేస్​లోని సిబ్బందితో ముచ్చటించారు వైమానిక దళాధిపతి. ఎలాంటి ఆటంకం కలగకుండా ఎయిర్​బేస్​లో కార్యకలాపాలు సాగించేందుకు వారు చేస్తున్న కృషిని ప్రశంసించారు. విధి నిర్వహణను అత్యంత శ్రద్ధతో కొనసాగించాలన్నారు.

ఇదీ చూడండి:- పబ్​జీ సహా 118 చైనా యాప్స్​పై నిషేధం

మరోవైపు.. భారత సైన్యాధిపతి​ ఎంఎం నరవణే తన రెండు రోజుల సరిహద్దు​ పర్యటనలో భాగంగా.. గురువారం లద్దాఖ్​లో సమీక్ష నిర్వహించారు.

గత నెల 29-30 అర్ధరాత్రి.. చైనా దురాక్రమణను భారత సైన్యం అడ్డుకున్న నేపథ్యంలో భదౌరియా, నరవణే పర్యటనలకు ప్రాధాన్యం ఏర్పడింది.

ఉద్రిక్తతలు...

భారత్​-చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి ఈ ఏడాది మే నెల నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జూన్​ 15న గల్వాన్​ లోయలో జరిగిన హింసాత్మక ఘటనతో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. సైనిక, దౌత్య స్థాయిలో చర్చలు జరుగుతున్నప్పటికీ... చైనా ద్వంద్వ వైఖరితో సమస్య ఓ కొలిక్కి రావడం లేదు.

ఇవీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.