ఆరు రోజుల క్రితం గల్లంతైన ఏఎన్-32 విమాన ఆచూకీ కోసం అధికారులు ఎంత ప్రయత్నించినా ఫలితం లభించలేదు. విమానంలో ఉన్న 13 మంది ప్రాణాలతో ఉన్నారో లేదో తెలియలేదు. రాత్రింబవళ్లు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ మాత్రం అంతు చిక్కలేదు. అందుకే గల్లంతైన విమానం ఎక్కడుందో కనుగొనేందుకు తాజాగా నగదు బహుమతిని ప్రకటించింది ఐఏఎఫ్.
భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 విమాన ఆచూకీ తెలిపిన వారికి రూ.5 లక్షల నగదును ఇస్తామని తెలిపింది. విమాన ఆచూకీ తెలిపేందుకు వీలుగా 9436499477 / 9402077267 / 9402132477 ఫోన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది.
సోమవారం మధ్యాహ్నం అసోంలోని జోర్హత్ నుంచి బయల్దేరిన ఏఎన్-32... అరుణాచల్ ప్రదేశ్-చైనా సరిహద్దులో గల్లంతయింది. ప్రమాదానికి గురైనప్పటి నుంచి అధికారులు విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టినా... విమాన జాడ ఇప్పటికీ లభించలేదు.
ఇదీ చూడండి : 'అసత్యాలు, విద్వేషాలతోనే అధికారంలోకి మోదీ'