రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ తిరుగుబాబాటుతో రాజకీయ సంక్షోభం తలెత్తడం వల్ల కాంగ్రెస్ నాయకత్వం అప్రమత్తమైంది. అధిష్ఠానం ఆదేశంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా... ఏ పదవిలో ఉన్నవారైనా సరే తమ సమస్యను పార్టీ ముందు ప్రస్తావించాలని కోరారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలందరూ సీఎల్పీ భేటీకి హాజరుకావాలని పిలుపునిచ్చారు.
-
#WATCH If anyone is upset in family, they should find a solution by sitting with members of the family...On behalf of Congress leadership, including Sonia ji & Rahul ji, I convey that doors of Congress party are always open for Sachin ji or any member: Randeep Surjewala, Congress pic.twitter.com/x4sYvVs4Gk
— ANI (@ANI) July 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH If anyone is upset in family, they should find a solution by sitting with members of the family...On behalf of Congress leadership, including Sonia ji & Rahul ji, I convey that doors of Congress party are always open for Sachin ji or any member: Randeep Surjewala, Congress pic.twitter.com/x4sYvVs4Gk
— ANI (@ANI) July 13, 2020#WATCH If anyone is upset in family, they should find a solution by sitting with members of the family...On behalf of Congress leadership, including Sonia ji & Rahul ji, I convey that doors of Congress party are always open for Sachin ji or any member: Randeep Surjewala, Congress pic.twitter.com/x4sYvVs4Gk
— ANI (@ANI) July 13, 2020
"రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం నడిపించేందుకు కాంగ్రెస్‌కు ప్రజలు ఓటేశారు. కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ సీఎల్పీ సమావేశానికి హాజరై.. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మరింత పటిష్ఠం చేయాలని అభ్యర్థిస్తున్నాను. ఏ పదవిలో ఉన్నవారైనా సరే తమ సమస్యను పార్టీ వేదికపై ప్రస్తావించండి. దాన్ని కలిసి పరిష్కరించి రాష్ట్రంలో ప్రభుత్వం ఇబ్బంది పడకుండా చూసేందుకు ప్రయత్నిస్తాం. కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే కుటుంబ సభ్యుల మధ్యే చర్చించుకోవాలి. సచిన్‌కు, ఇతర నాయకుల కోసం కాంగ్రెస్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పార్టీ నాయకత్వం తరపున స్పష్టం చేస్తున్నా."
-రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి
గత 48 గంటల నుంచి కాంగ్రెస్ నాయకత్వం సచిన్ పైలట్‌తో సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు సుర్జేవాలా. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడినట్లు చెప్పారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని భారతీయ జనతా పార్టీ చేస్తున్న కుట్రలు విజయవంతం కావని సుర్జేవాలా పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి- భాజపా కుట్రలు సాగవు.. పూర్తికాలం మా ప్రభుత్వమే: కాంగ్రెస్