ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్‌ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రవాదిగా పేర్కొనటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది భాజపా. ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెట్టాలని డిమాండ్ చేసింది.
నాథూరాం గాడ్సెపై చేసిన వ్యాఖ్యలకు ప్రగ్యా క్షమాపణలు కోరిన క్రమంలో.. కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేశారు. ఆ సమయంలో ఓ ఎంపీని తీవ్రవాదిగా పేర్కొనటమేంటని ప్రశ్నిస్తూ.. రాహుల్ గాంధీపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టాలని భాజపా ఎంపీ నిశికాంత్ దూబే డిమాండ్ చేశారు. స్పీకర్ చట్టాన్ని సంరక్షించేవారని.. సభ సభ్యుల గౌరవాన్ని కాపాడాలని కోరారు దూబే.
దేనికైనా సిద్ధం: రాహల్
ప్రగ్యా సింగ్‌పై తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు రాహుల్. దీనిపై ఏ చర్యనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. నాథూరాం గాడ్సె దారిలోనే భాజపా ఎంపీ హింసను నమ్ముతున్నారని ఆరోపించారు.
"ప్రగ్యా హింసనే నమ్ముతున్నారు. నేను ఆమెతో ఏకీభవించను. సభా హక్కుల ఉల్లంఘన తీర్మానంతో వచ్చిన సమస్యేమీ లేదు. వారికి నచ్చింది చేసుకోనివ్వండి. దానిని నేను ఎదుర్కొంటాను. వారు ఏదైనా చేయని.. నా వైఖరి ఏంటో వెల్లడించాను."
- రాహుల్ గాంధీ
ఇదీ చూడండి: 'మహా' సీఎంగా ఉద్ధవ్ బాధ్యతలు- రేపు అసెంబ్లీలో బలపరీక్ష