ETV Bharat / bharat

'నేనెప్పుడూ మాస్కు ధరించను.. అయితే ఏంటీ?'

మధ్యప్రదేశ్​ హోం మంత్రి, భాజపా నేత నరోత్తం మిశ్రా వివాదంలో చిక్కుకున్నారు. బహిరంగ కార్యక్రమాల్లో మాస్కు ధరించలేదని రిపోర్టర్లు ప్రశ్నిస్తే.. 'నేనెప్పుడూ మాస్కు ధరించను, అయితే ఏంటీ?' అని బదులిచ్చారు. కాసేపటి తర్వాత.. తనకు శ్వాస సంబంధిత సమస్యలున్నాయని వివరణ ఇచ్చారు.

author img

By

Published : Sep 24, 2020, 4:24 AM IST

I never wear a face mask: MP home minister
'నేనెప్పుడూ మాస్కు ధరించను.. అయితే ఏంటీ?'

రాష్ట్రంలో ఓ వైపు కరోనా విజృంభిస్తుంటే.. మధ్యప్రదేశ్​ హోం మంత్రి, భాజపా నేత నరోత్తం మిశ్రా చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. ఏ కార్యక్రమంలోనూ తాను మాస్కు ధరించనని ఆయన వ్యాఖ్యానించారు. ఇందోర్​లో ఓ ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన సమయంలో.. మంత్రిని 'మీరెప్పుడూ మాస్కు ధరించట్లేదు.. కారణమేంటీ' అని రిపోర్టర్లు ప్రశ్నించగా.. ''నేను ఏ కార్యక్రమంలోనూ మాస్కు ధరించను. అయితే ఏంటీ?'' అని ఎదురుప్రశ్నించారు మంత్రి.

అదే కార్యక్రమానికి హాజరైన మిశ్రా కేబినెట్​ సహచరులు తులసీరామ్​ శీలావత్​, ఇతర భాజపా నేతలు మాత్రం మాస్కులు ధరించారు.

హోం మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్​.. కొవిడ్​ నిబంధనలు సామాన్య ప్రజలకేనా, ప్రజాప్రతినిధులకు పట్టవా అని ప్రశ్నించింది.

'' మీలో ఎవరికైనా ఆయన(నరోత్తం)పై చర్యలు తీసుకొనే ధైర్యం ఉందా? నిబంధనలు కేవలం సామాన్య ప్రజలకేనా?''

- నరేంద్ర సలూజా, మధ్యప్రదేశ్​ కాంగ్రెస్​ ప్రతినిధి

తన వ్యాఖ్యలపై రాజకీయంగా విమర్శలు ఎదురవడం వల్ల వివరణ ఇచ్చారు మంత్రి నరోత్తం మిశ్రా. ఆరోగ్య సమస్యల వల్ల మాస్కును ఎక్కువ సేపు ధరించట్లేదని తెలిపారు. తనకు శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నాయని స్పష్టం చేశారు.

మధ్యప్రదేశ్​లో ఇప్పటివరకు 20 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మరో 800కుపైగా ప్రాణాలు కోల్పోయారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.