తొలి తెలుగు శాటిలైట్ ఛానల్ ఈటీవీ.. 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు . ఈటీవీ కీలక మైలురాయిని అందుకుందని కొనియాడారు. రామోజీ గ్రూపు, ఈటీవీ తెలుగు యాజమాన్యం, సిబ్బందికి శుభాకాంక్షలు తెలుపుతూ.. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
" గడిచిన 25 ఏళ్లలో 7 కోట్లకుపైగా వీక్షకులతో అత్యంత ఆదరణ పొందిన ఛానల్‌గా ఈటీవీ అవతరించింది. దేశ, విదేశాల్లోని తెలుగువారి హృదయాలను గెలుచుకున్న ఈటీవీకి నా అభినందనలు. ప్రజలకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తూ.. సాధికారతవైపు నడిపిస్తోంది"
- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి
ఈటీవీ తన ప్రమాణాలు, విలువలను కొనసాగిస్తూ.. విశ్వసనీయతను కాపాడుకుంటోందని ప్రశంసించారు వెంకయ్య. రైతుల్లో అవగాహన కల్పిస్తూ.. వారిని సాధికారత వైపు నడిపించేందుకు ఈటీవీ చేపట్టిన అన్నదాత కార్యక్రమం తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఈటీవీ రజతోత్సవ వేళ.. తారల శుభాకాంక్షల వెల్లువ