ETV Bharat / bharat

'కరోనా చికిత్సలో ఆ మందుపై నమ్మకం వద్దు'

కరోనా వైరస్​ చికిత్సలో మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్​ అంతగా ప్రయోజనకారి కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా దీని వల్ల హృద్రోగ సమస్యలు తలెత్తే అవకాశముందని చెబుతున్నారు. తద్వారా మరణమూ సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Hydroxychloroquine
హైడ్రాక్సీ క్లోరోక్విన్
author img

By

Published : May 7, 2020, 8:08 AM IST

కరోనా వైరస్​కు వ్యాక్సిన్​ కనిపెట్టేందుకు విస్తృతంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. మరోవైపు వైద్యులు వ్యాప్తితో పాటు వ్యాధిని నియంత్రించేందుకు కృషి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న హైడ్రాక్సీ క్లోరోక్విన్​ ఔషధ వినియోగం, దానివల్ల కలిగే దుష్ఫలితాలు, ఉపయోగాలపై దృష్టి సారించారు నిపుణులు.

ఫలితంగా కరోనా చికిత్స కోసం ప్రపంచ దేశాలు హైడ్రాక్సీ క్లోరో క్విన్​ (హెచ్​సీక్యూ) సామర్థ్యం పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే వైద్య నిపుణులు మాత్రం ఈ మందు పని తనంపై సందేహాలు వ్యక్తం చేస్తు్న్నారు.

నమ్మకం వద్దు..

కరోనాకు హెచ్​సీక్యూ దివ్య ఔషధం కాదని పెదవి విరుస్తున్నారు. కరోనా విషయంలో ఊహించినంత ప్రయోజనం చేకూర్చలేదని.. దీనిపై నమ్మకం పెట్టుకోవద్దని సూచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో దీని ద్వారా మరణమూ సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

"కరోనాకు నిర్ధిష్టమైన చికిత్స విధానం ఇంకా లేదు. వైరల్​ చికిత్సలో భాగంగానే కరోనాకు హెచ్​సీక్యూను ప్రాథమిక ఔషధంగా ఉపయోగిస్తున్నారు. దీని సామర్థ్యంపై శాస్త్రీయ రుజువులేమీ లేవు. అయితే దీని వల్ల హృద్రోగ సమస్యలు తలెత్తుతున్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి."

- ఎంసీ మిశ్రా, ఎయిమ్స్ మాజీ డైరెక్టర్​

ఆకస్మిక గుండెపోటు..

ప్రపంచవ్యాప్తంగా హెచ్​సీక్యూతోపాటు అజిత్రోమైసిన్​ వాడకం వల్ల కొన్ని మరణాలు సంభవించినట్లు పలు నివేదికలు చెబుతున్నాయని ఎయిమ్స్​ కొవిడ్​- 19 బృంద నిపుణులు యుధవీర్​ సింగ్ తెలిపారు. హృదయ స్పందనలకు సంబంధించి పొటాషియం ఛానల్​ను హెచ్​సీక్యూ నిలిపివేస్తుందని.. ఫలితంగా ఆకస్మిక గుండెపోటు వస్తుందన్నారు.

భారత్​పై ఆధారం..

కరోనా వైరస్​ అంతకంతకూ పెరుగుతుండటం, అత్యవసర చికిత్స విధానాన్ని రూపొందించే నేపథ్యంలో హెచ్​సీక్యూపైనే అమెరికా సహా చాలా దేశాలు ఆధారపడ్డాయి. ఫలితంగా దీన్ని అధికంగా ఉత్పత్తి చేసే భారత్​కు అనేక దేశాల నుంచి విజ్ఞప్తులు మొదలయ్యాయి. అమెరికా సహా చాలా దేశాలకు భారీగా హెచ్​సీక్యూను భారత్​ సరఫరా చేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.