మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఓ మహిళ విడాకులకు చెప్పిన కారణం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. తన భర్త వారం పాటు స్నానం చేయట్లేదని, గడ్డం తీయించుకోవట్లేదని విడాకులు మంజూరు చేయాలని భోపాల్ ఫ్యామిలీ కోర్టును కోరింది షౌల్ అవస్థీ. ఆమె వినతిని పరిశీలించిన కోర్టు దంపతులిద్దరూ ఆరు మాసాల పాటు వేర్వేరుగా ఉండాలని సూచించింది.
అనంతరం వారి వ్యాజ్యాన్ని పరిశీలించి అవసరమైతే విడాకులు మంజూరు చేస్తామని స్పష్టం చేసింది. ఈ కేసు నెల రోజుల కిందట జరిగిందని అధికారులు వెల్లడించారు.
ఈ దంపతులది కులాంతర వివాహం. పెద్దలు కుదిర్చి చేసిన పెళ్లి. వీరి భవితవ్యం తేలాలంటే మరో ఐదు నెలలు ఆగాల్సిందే.