ETV Bharat / bharat

రెండో భార్యకు లేరని.. మొదటి భార్య కూతురు హత్య - karnataka chamarajanagara news

కర్ణాటక చామరాజనగరలో దారుణం జరిగింది. రెండో భార్యకు సంతానం కలగటం లేదన్న బాధతో విడాకులు ఇచ్చిన మొదటి భార్య కూతురును చంపాడు ఓ కిరాతకుడు. వివరాల్లోకి వెళితే..

karnataka
బాలిక
author img

By

Published : Aug 25, 2020, 10:50 PM IST

రెండో భార్యకు సంతానం కలగట్లేదని కోపం పెంచుకున్న భర్త.. తాను విడాకులు ఇచ్చిన మొదటి భార్య కూతురుని చంపేశాడు. ఈ ఘటన కర్ణాటక చామరాజనగర జిల్లాలో జరిగింది.

జిల్లాలోని సోమహళ్లిలో నివసించేవాడు మహేశ్​. అతనికి గౌరమ్మతో వివాహమైంది. కొన్నేళ్ల తర్వాత గౌరమ్మకు విడాకులు ఇచ్చి.. రత్నమ్మను పెళ్లి చేసుకున్నాడు. గౌరమ్మ కూడా మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి కూతురు జన్మించింది.

తనకు లేరనే బాధ.. ఆమెపై కోపంతో

అయితే మహేశ్​, రత్నమ్మ దంపతులకు మాత్రం సంతానం కలగలేదు. ఈ విషయంలో బాధపడుతున్న మహేశ్​కు.. గౌరమ్మకు సంతానం కలగటంతో కోపాన్ని పెంచుకున్నాడు. చివరికి గౌరమ్మ ఐదేళ్ల కూతురు మహాలక్ష్మిని చంపాలని నిర్ణయించుకున్నాడు. చిన్నారిని అపహరించిన మహేశ్​.. రత్నమ్మ సాయంతో చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని సిమెంట్ సంచిలో పెట్టి గదిలో దాచాడు.

కూతురు కనిపించటం లేదని గౌరమ్మ ఫిర్యాదు చేయటంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహేశ్​పై అనుమానంతో విచారించగా.. తప్పును అంగీకరించాడు. అతని ఇంటిలో ఉన్న మహాలక్ష్మి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. మహేశ్​తోపాటు రత్నమ్మను అరెస్టు చేశారు.

ఇదీ చూడండి: కూలిన ఆ భవనంలో నాలుగేళ్ల బాలుడు సేఫ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.