ETV Bharat / bharat

సూరత్​లోనూ రోడ్డెక్కిన కూలీలు- లాక్​డౌన్​ 2.0పై అసహనం

గుజారాత్​లోని సూరత్​లో వందలాది మంది వలస కార్మికులు రోడ్లపైకి వచ్చారు. భౌతిక దూరం నిబంధనను ఉల్లంఘించారు. తమను స్వస్థలాలకు పంపాలని డిమాండ్​ చేశారు. స్థానిక ఎమ్మెల్యే సహాయంతో పోలీసులు పరిస్థితిని అదుపుచేశారు.

hundreds-of-diamond-workers-gathered-near-varacha-road-in-surat-city-of-gujarat-cisf-and-police-lathicharged-on-them
లాక్​డౌన్​ పొడిగింపుపై అసహనం- రోడ్లపైకి భారీగా కూలీలు
author img

By

Published : Apr 14, 2020, 9:10 PM IST

గుజరాత్​ సూరత్​లో వందలాది వలస కార్మికులు రోడ్లపైకి వచ్చారు. భౌతిక దూరం నిబంధలనను ఉల్లంఘిస్తూ వరాచ్ఛ ప్రాంతంలో గుమిగూడారు. తమను స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేయాలని డిమాండ్​ చేశారు. వీరిలో అనేక మంది స్థానికంగా డైమండ్​ పాలిషింగ్​ వర్కర్లుగా పనిచేస్తున్నారు.

ఈ రోజుతో లాక్​డౌన్​ ముగుస్తుందని భావించినప్పటికీ.. మే 3వరకు పొడిగించడం వల్ల కార్మికులు తీవ్ర అసహనానికి గురైనట్టు పోలీసులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి కిషోర్​ కనని కూడా ఘటనాస్థలానికి వెళ్లి కూలీలకు నచ్చజెప్పారు. అనంతరం పరిస్థితులు సద్దుమణిగాయని పోలీసులు వెల్లడించారు.

లాక్​డౌన్​ పొడిగింపుపై అసహనం- రోడ్లపైకి భారీగా కూలీలు

సూరత్​లో కూలీలు ఇలా నిరసనలు చేపట్టడం ఇది రెండోసారి. గత శుక్రవారం ఇదే విధంగా రోడ్లపైకి వచ్చి భౌతిక దూరం నిబంధనను ఉల్లంఘించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.