కరోనాపై పోరులో మానవాళి కచ్చితంగా విజయం సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రపంచ దేశాలు ఐకమత్యంతో కలిసి ముందుడుగేస్తున్నాయని తెలిపారు.
"ప్రపంచం ఐకమత్యంగా కరోనాపై పోరుడుతోంది. ఈ మహమ్మారిపై మానవాళి కచ్చితంగా విజయం సాధిస్తుంది."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
స్విట్జర్లాండ్లోని మాట్టర్హార్న్ పర్వతంపై 1000 మీటర్ల భారతీయ జెండాను ప్రదర్శించింది జెర్మాట్ అనే పర్యటక సంస్థ. ఆ ఫొటోను ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దీనిపై స్పందిస్తూ ప్రధాని ఈ మేరకు ట్వీట్ చేశారు.
'మీ సహాయం భేష్...'
దేశంలోని వివిధ మంత్రిత్వశాఖలపై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. లాక్డౌన్లో ప్రజలు ఇబ్బంది పడకుండా ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలు ఎంతో గొప్పగా ఉన్నాయని కొనియాడారు.
-
Proud of the Indian Railways team.
— Narendra Modi (@narendramodi) April 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
They’ve been continuously helping our citizens in this crucial hour. https://t.co/LnrYJjpyJz
">Proud of the Indian Railways team.
— Narendra Modi (@narendramodi) April 18, 2020
They’ve been continuously helping our citizens in this crucial hour. https://t.co/LnrYJjpyJzProud of the Indian Railways team.
— Narendra Modi (@narendramodi) April 18, 2020
They’ve been continuously helping our citizens in this crucial hour. https://t.co/LnrYJjpyJz
రైల్వేశాఖ, పెట్రోలియం శాఖ, పౌరవిమానయాన శాఖ, ఆదాయపు పన్ను శాఖతో పాటు మరిన్ని మంత్రిత్వశాఖలు.. ఈ లాక్డౌన్లో చేపట్టిన చర్యలను వివరిస్తూ ఆయా ట్విట్టర్ ఖాతాలో ట్వీట్స్ చేశాయి. వీటన్నిటిపై స్పందించిన మోదీ.. ప్రజలకు ఎంతో గొప్పగా సహాయం చేస్తున్నాయని ప్రశంసించారు.