జమ్ముకశ్మీర్‌లో మానవ హక్కులకు పూర్తి స్థాయిలో భంగం కలిగిందని ఆరోపించారు పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ. బలగాల మోహరింపుపై తీవ్రంగా స్పందించారు. కశ్మీర్ లోయలో శాంతి నెలకొనేందుకు ప్రార్థించాలని ప్రజలను కోరారు.
ప్రపంచ మానవతా దినం సందర్భంగా మానవ హక్కలపై తాను చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు దీదీ.
" ఈ రోజు ప్రపంచ మానవతా దినం. కశ్మీర్లో మానవ హక్కులు పూర్తిగా ఉల్లంఘనకు గురయ్యాయి. కశ్మీర్లో మానవ హక్కులు, శాంతి కోసం ప్రార్థిద్దాం. మానవ హక్కుల అంశం నా హృదయానికి దగ్గరగా ఉంటుంది. 1995లో లాకప్ డెత్‌లకు వ్యతిరేకంగా మానవ హక్కుల ఉల్లఘనలపై 21 రోజులు రోడ్లపై నిరసన చేశాను."
- మమతా బెనర్జీ, పశ్చిమ బంగ ముఖ్యమంత్రి.
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370, 35ఏలను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. కశ్మీర్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. కశ్మీర్లో ఆంక్షల విధింపును తప్పుపట్టారు మమత.
ఇదీ చూడండి: ఉప్పులో ఉంచితే చనిపోయినా లేచొస్తారా...?