ఉత్తర్‌ప్రదేశ్-దిల్లీ సరిహద్దు గాజియాబాద్‌లో వందలాది మంది వలస కార్మికులు, సొంతింటికి వెళ్లేందుకు బస్సుల కోసం వేచి చూస్తున్నారు.
ప్రత్యేక బస్సులు..
దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన వలస కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సొంత గ్రామాలకు వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారు. వారి కష్టాలను దృష్టిలో పెట్టుకుని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం దిల్లీ నుంచి ప్రతి రెండు గంటలకు ఓ బస్సు సౌకర్యం కల్పించింది. ఇతర ప్రధాన ప్రాంతాలతో కలుపుకుని మొత్తం 1000 బస్సులు నడుపుతోంది. దీంతో సమయానికి బస్సును అందుకునేందుకు జనం బస్టాండుల్లో బారులు తీరారు.