ETV Bharat / bharat

లాక్​డౌన్​ తర్వాత స్కూళ్లు, కాలేజీల్లో కొత్త రూల్స్​ - HRD framing new guidelines for schools, colleges

దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభమయ్యాక పాటించాల్సిన నిబంధనలపై మార్గదర్శకాలు రూపొందిస్తోంది కేంద్రం. లాక్​డౌన్​ అనంతరం విద్యాలయాలు తిరిగి ప్రారంభం కాగానే.. వీటిని తప్పక పాటించాలని కేంద్ర మానవ వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.

HRD new guidelines for schools, colleges
స్కూళ్లు, కాలేజీల మార్గదర్శకాలపై కేంద్రం కసరత్తు
author img

By

Published : May 1, 2020, 5:28 PM IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా.. పాఠశాలలు, కళాశాలలకు మార్గదర్శకాలపై కసరత్తు చేస్తోంది కేంద్రం. విద్యాలయాలు తిరిగి ప్రారంభం కాగానే.. నూతన సీటింగ్​ అరేంజ్​మెంట్​, షిఫ్ట్​ల వారీగా తరగతులు, మెస్​, లైబ్రరీకి సంబంధించి సరికొత్త నిబంధనలు తీసుకురానున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. స్కూళ్లు, కాలేజీలు తిరిగి ప్రారంభమవడానికి ముందుగానే ఈ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అందించనున్నట్లు స్పష్టం చేశారు.

పాఠశాలలకు డిపార్ట్​మెంట్​ ఆఫ్​ స్కూల్​ ఎడ్యుకేషన్​ అండ్​ లిటరసీ, కళాశాలలకు యూనివర్సిటీ ఆఫ్​ గ్రాంట్ కమిషన్​(యూజీసీ)లు వేర్వేరుగా మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నాయి. కొత్తగా కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో చేరే వారికి సెప్టెంబర్​ నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని యూజీసీ ఇప్పటికే ప్రకటించింది.

మరోవైపు పెండింగ్​లో ఉన్న పది, పన్నెండు తరగతికి చెందిన 29 సబ్జెక్టుల పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది సీబీఎస్​ఈ. షెడ్యూల్​ను మాత్రం ఇంకా ఖరారు చేయలేదు.

క్రీడలు​ బంద్!

స్కూళ్లలో ఉదయం నిర్వహించే అసెంబ్లీలతో పాటు మైదానాల్లో క్రీడా కార్యక్రమాలు రద్దు చేయాలని గత వారం అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్​. స్కూల్ యూనిఫాం లాగానే.. మాస్క్​ కూడా తప్పనిసరి చేయాలని, రెసిడెన్షియల్​ స్కూళ్లలోని మెస్​లు, వసతి గృహాలతో పాటు స్కూల్​ బస్సుల్లో భౌతిక దూరం తప్పక పాటించేలా చూడాలని వెల్లడించారు. పాఠశాల​ ఆవరణతో పాటు క్యాంటీన్లు, బాత్​రూమ్​ల్లో చేయాల్సిన, చేయకూడని పనులను విద్యార్థులకు వివరించాలని మంత్రులకు సూచించారు పోఖ్రియాల్​.

కళాశాలల్లో సెమిస్టర్​ పరీక్షలను జులైలో నిర్వహించొచ్చని యూజీసీ ప్రతిపాదించింది. ఆన్​లైన్​ లేదా ఆఫ్​లైన్​ ఏ మాధ్యమంలోనైనా పరీక్షలు​ జరపొచ్చని తెలిపింది.

కొవిడ్​-19 వ్యాప్తి నేపథ్యంలో మార్చి 16 నుంచి దేశవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మూతబడ్డాయి. మార్చి 3వరకు లాక్​డౌన్ ఆంక్షలు కొనసాగనున్నాయి.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.