ETV Bharat / bharat

ఆ రాష్ట్రంలోని పాఠశాలల్లో 'యోగా సబ్జెక్ట్​' - యోగా

వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో యోగాను ప్రత్యేక సబ్జెక్ట్​ చేయాలని హరియాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాక రాష్ట్రవ్యాప్తంగా వెయ్యికి పైగా యోగశాలలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది.

HR-SCHOOLS-YOGA
'ఆ రాష్ట్రంలోని పాఠశాలల్లో 'యోగా సబ్జెక్ట్​'
author img

By

Published : Dec 3, 2020, 5:39 AM IST

యోగా ప్రాముఖ్యతను భావితరాలకు తెలిపే దిశగా హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో యోగాను ప్రత్యేక సబ్జెక్ట్​గా చేయనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. హరియాణా యోగా పరిషత్ ఛైర్మన్​తో సంప్రదింపులు జరిపాక ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో దేశంలోనే యోగాను పాఠ్యాంశంగా చేర్చిన మొదటి రాష్ట్రంగా హరియాణా నిలిచింది.

అంతేకాక ప్రతి నెలా మొదటి ఆదివారంరోజు 'యోగా ప్రశిక్షణ్​ దివస్​'ను నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది హరియాణా ప్రభుత్వం. ప్రతి జిల్లా, బ్లాక్​, మండలాల్లోని ప్రజలకు యోగా శిక్షణ ఇవ్వనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.