హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర డీజీపీ సంజయ్ కుండు, మరో 30 మంది అధికారులు గృహనిర్బంధంలోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. డీజీపీని కలిసిన ఓ వ్యక్తి మంగళవారం కరోనా మహమ్మారితో మృతి చెందిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
సంజయ్ కుండు జూన్ 1 ఆ రాష్ట్ర డీజీపీగా పదవీ భాద్యతలు చేపట్టారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయటానికి ప్రధాన కార్యాలయానికి ఓ వ్యక్తి వచ్చాడు. తర్వాత సదరు వ్యక్తి దిల్లీకి వెళ్లాడు. అతడికి వైరస్ పరీక్షలు నిర్వహించగా సోమవారం పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యిందని, మంగళవారం మరణించినట్లు పోలీసు శాఖ ప్రతినిధి కుషాల్ శర్మ తెలిపారు.
ఈ వార్త తెలిసిన అనంతరం డీజీపీ, మరో 30 మంది అధికారులు గృహ నిర్బంధంలో ఉన్నట్లు వెల్లడించారు కుషాల్. ప్రధాన కార్యాలయాన్ని శానిటైజ్ చేయటం కోసం తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారుల నుంచి నమూనాలను సేకరించినట్లు వివరించారు.