ETV Bharat / bharat

కొవిషీల్డ్​, కొవాగ్జిన్.. ఏ టీకా పవరెంత?

దేశంలో వ్యాక్సినేషన్​ కోసం కొవాగ్జిన్​, కొవిషీల్డ్​ టీకాలు అందుబాటులో ఉన్నాయి. మరి ఒక్కసారి వీటిని వాడితే ఎంతకాలం నిశ్చింతగా ఉండొచ్చు? యాంటీ బాడీలు ఎన్నేళ్లు మన శరీరంలో ఉంటాయి? ఆ వివరాలు తెలుసుకుందాం.

COVISHIELD
కొవిషీల్డ్​, కొవాగ్జిన్.. ఏ టీకా పవరెంత?
author img

By

Published : Jan 16, 2021, 9:33 AM IST

Updated : Jan 16, 2021, 10:36 AM IST

భారత్​తో పాటు అనేక దేశాల్లో కొవిడ్​ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. మరి దేశంలో వ్యాక్సినేషన్​కు వినియోగిస్తున్న కొవాగ్జిన్​, కొవిషీల్డ్​ టీకాల సామర్థ్యం ఎంతకాలం వరకు ఉంటుందో తెలుసుకుందాం.

కొవిషీల్డ్‌ కథేంటి?

ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన 'అడెనోవైరస్‌' వాక్సిన్‌ను భారత్‌లోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేస్తోంది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ముఖ్య పరిశోధకురాలు ప్రొఫెసర్‌ సారా గిల్బర్ట్‌ చెబుతున్న దాని ప్రకారం.. ప్రాథమికంగా కొందరిపై ప్రయోగ పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాలు బేరీజు వేశాక ఈ టీకా రెండు డోసులు వాడితే కొన్నేళ్లపాటు కరోనా దరి చేరదు. మనిషి శరీరంలో సహజసిద్ధంగా ఉత్పత్తి అయ్యే రోగ నిరోధకశక్తి కన్నా వాక్సిన్‌ ఎన్నోరెట్లు ప్రభావవంతంగా పని చేస్తుంది అన్నారామె.

మన సత్తా సంగతేంటి?

హైదరాబాద్​కు చెందిన భారత్‌ బయోటెక్‌ రూపొందించిన కొవాగ్జిన్‌ మూడో దశ ప్రయోగాలు పూర్తి కాకుండానే ప్రభుత్వం నుంచి అత్యవసర అనుమతి పొందింది. ఈ టీకా సామర్థ్యంపై డీసీజీఐ పూర్తి నమ్మకం ఉంచింది. భారత్‌ బయోటెక్‌ విడుదల చేసిన పరిశోధక పత్రంలో తాము రూపొందించిన టీకాతో ఒక మనిషి శరీరంలో యాంటీబాడీలు ఆరు నెలల నుంచి ఏడాది పాటు ఉంటాయని సంస్థ ప్రకటించింది.

Last Updated : Jan 16, 2021, 10:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.