కశ్మీర్లో 6 నెలల తరువాత పునరుద్ధరించిన అంతర్జాల సేవలను గంటల వ్యవధిలోనే అధికారులు నిలిపివేశారు. ఇది తాత్కాలికమేనని, గణతంత్ర వేడుకలు ముగిసిన తరువాత మరలా పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.
ఆర్టికల్ 370 రద్దుతో
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. అప్పటి నుంచి అక్కడ మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.
కొన్నింటికే పరిమితం
సుప్రీంకోర్టు జనవరి 10న ఇచ్చిన తీర్పు మేరకు... జనవరి 18న జమ్ము కశ్మీర్లో ప్రీపెయిడ్ మొబైల్ సేవలను పునరుద్ధరించారు. ఇవాళ 2జీ అంతర్జాల సేవలు పునరుద్ధరించారు. అయితే ప్రభుత్వం అనుమతించిన 301 వెబ్సైట్లను మాత్రమే యాక్సెస్ చేయడానికి వీలవుతుందని అధికారులు స్పష్టం చేశారు. వీటిలో బ్యాంకింగ్, విద్య, వార్తలు, ప్రయాణ, యుటిలిటీ, ఉపాధికి సంబంధించిన వెబ్సైట్లు ఉన్నాయి.
గణతంత్ర వేడుకలు రేపు జరగనున్న నేపథ్యంలో భద్రత కారణాల రీత్యా లోయలో అంతర్జాల సేవలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: 71వ గణతంత్ర భారతావని... ఎంపికైన పద్మ గ్రహీతలు వీరే