తూర్పు లద్దాఖ్‌లో నెలకొన్న ఉద్రిక్త సమస్యలను పరిష్కరించేందుకు భారత్-చైనా మధ్య ఒప్పందం కుదురుతుందని సైన్యాధ్యక్షుడు ఎంఎం నరవాణే ఆశాభావం వ్యక్తం చేశారు. ఏదేమైనా.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సన్నద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఈ నెల 15న జరగనున్న ఆర్మీడే సందర్భంగా మీడియాతో మాట్లాడారు నరవాణే. భారత సైన్యం తీవ్రస్థాయిలో సన్నద్ధమవుతోందని.. దేశ లక్ష్యాలను సాధించేందుకు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని వెల్లడించారు.
అయితే తూర్పు లద్దాఖ్ వెంబడి భారత్-చైనాలు తమ బలగాలను ఉపసంహరించుకోలేదని స్పష్టం చేశారు నరవాణే. అయితే లద్దాఖ్‌లోనే కాకుండా.. మొత్తం వాస్తవాధీన రేఖ వెంబడి భారత సైన్యం అప్రమత్తంగా ఉంటోందని తెలిపారు.
గతేడాది మేలో మొదలైన సరిహద్దు ప్రతిష్టంభన ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సమస్య పరిష్కారానికి ఇరు పక్షాలు అనేక దఫాల్లో చర్చలు జరిపినా ఎలాంటి ఫలితం దక్కలేదు.
ఇదీ చూడండి:- 'ఆ రెండు దేశాలతో భారత్‌కు ముప్పు'