జులై 1 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది. సమీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్ గవర్నర్ ఎస్పీ మాలిక్‌తో కేంద్రహోంమంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి జ్ఞానేశ్ కుమార్ శుక్రవారం చర్చలు జరిపారు.
యాత్ర కోసం చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్ల గురించి గవర్నర్ మాలిక్‌కు జ్ఞానేశ్ కుమార్ వివరించారు. యాత్ర సమయంలో భక్తులకు సౌకర్యాల కల్పన... భద్రతా చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. ఈ చర్చలో గవర్నర్ మాలిక్, జ్ఞానేశ్‌కుమార్‌తో పాటు నిఘా సంస్థ అధికారులు కూడా పాల్గొన్నారు.
జమ్ముకశ్మీర్ పోలీసులు, నిఘా సంస్థలు, రాష్ట్ర పాలనాధికారులతో జరిగిన విస్తృత సమావేశాల గురించి గవర్నర్‌కు అదనపు కార్యదర్శి వివరించారు. పహల్గామ్, బాల్టల్ మార్గాల్లో చేపట్టాల్సిన నిఘా ఏర్పాట్ల గురించీ చర్చించారు.
ఇదీ చూడండి: 'ఎన్నికల కమిషనర్ల నియామకానికి కొలీజియం కావాలి'