ETV Bharat / bharat

మోదీ X దీదీ: ఐపీఎస్​ల బదిలీపై వివాదం తీవ్రం - bengal officers

కేంద్రం, పశ్చిమ్​ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది. బంగాల్​కు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారులను డిప్యుటేషన్​పై తక్షణమే కేంద్రానికి పంపాలని హోంమంత్రిత్వ శాఖ మరోసారి జారీ చేసిన ఆదేశాలపై మమత మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ముగ్గురు అధికారులను కేంద్రానికి పంపాలనడం అధికార దుర్వినియోగమేనని విమర్శించారు.

Home Ministry has sent another communication to West Bengal Govt to relieve three IPS officers at the earliest.
కేంద్రంXదీదీ: ఐపీఎస్​ల డిప్యుటేషన్​పై వివాదం తీవ్రం
author img

By

Published : Dec 17, 2020, 3:17 PM IST

బంగాల్​కు చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల డిప్యుటేషన్​ అంశంపై కేంద్రానికి, మమతా బెనర్జీ ప్రభుత్వానికి మధ్య వివాదం అంతకంతకూ తీవ్రమవుతోంది. ముగ్గురు అధికారులను తక్షణమే పంపాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మరోసారి ఆదేశాలు పంపింది. ఈ విషయంపై మమతా మండిపడ్డారు. రాష్ట్రప్రభుత్వం అనుమతి లేకుండా ఐపీఎస్ అధికారులను కేంద్రానికి పంపాలనడం అధికార దుర్వినియోగమనేని, ఇది ఐపీఎస్ కేడర్​ అత్యవసర నిబంధన-1954ను వక్రీకరించడమేనని ధ్వజమెత్తారు.

విస్తరణవాదులకు, అప్రజాస్వామిక శక్తులకు తలవంచే ప్రసక్తే లేదని కేంద్రంపై ఘాటు విమర్శలు చేశారు మమత. మరోవైపు కేంద్రం మాత్రం ముగ్గురు ఐపీఎస్​ అధికారులకు ప్రభుత్వం బాధ్యతలు కూడా అప్పగించిందని, వీలైనంత త్వరగా వారిని పంపాలని బంగాల్​ ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బంగాల్​లో గతవారం పర్యటించినప్పుడు ఆయన కాన్వాయ్​పై రాళ్లదాడి జరిగింది. ఇందుకు భద్రతా ఏర్పాట్ల వైఫల్యమే కారణమని కేంద్రం భావించింది. నడ్డా పర్యటనకు భద్రతా ఏర్పాట్లు సమీక్షించిన ముగ్గురు ఐపీఎస్​ అధికారులు కేంద్రానికి రావాలని గతవారమే మొదటిసారి ఆదేశించింది. ఇప్పుడు మరోసారి ఉత్తర్వులు పంపింది.

ఇదీ చూడండి: జేపీ నడ్డా కాన్వాయ్​పై రాళ్ల దాడి

ఐపీఎస్​ల డిప్యుటేషన్​కు దీదీ సర్కార్ నో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.