ETV Bharat / bharat

అంచున 'కమల్'​ సర్కార్​- 12న కమలం గూటికి సింధియా! - మధ్యప్రదేశ్​ రాజకీయాలు తాజా వార్తలు

మధ్యప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. కాంగ్రెస్‌ కీలక నేత జోతిరాదిత్య సింధియా పార్టీకి రాజీనామా చేయగా ఆయన వర్గానికి చెందిన 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా బాట పట్టారు. రాజీనామా లేఖలను గవర్నర్‌కు పంపగా భాజపా నాయకులు వాటిని స్పీకర్‌కు అందించారు. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన సింధియా ఈ నెల 12న భాజపాలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో మధ్యప్రదేశ్‌లో 15 నెలల కాంగ్రెస్‌ సర్కారు పతనం అంచుకు చేరుకుంది.

Holi shock for Congress
పతనం అంచున 'కమల్'​ సర్కార్​- 12న కమలం గూటికి సింధియా!
author img

By

Published : Mar 10, 2020, 9:19 PM IST

మధ్యప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక యువనేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 12న ఆయన భాజపాలో చేరే అవకాశం ఉంది.

రాజీనామా చేసే ముందు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సింధియా చర్చలు జరిపారు. తర్వాత ఇద్దరూ కలిసి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అయ్యారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సింధియా రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో ప్రజాసేవ చేసేందుకు అవకాశం లేనందునే.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధినేత్రి సోనియాగాంధీకి రాసిన లేఖలో సింధియా పేర్కొన్నారు.

తర్వాత భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో సింధియా సమావేశమయ్యారు. ఫలితంగా ఆయన భాజపాలో చేరడం లాంఛనమే అయ్యింది. ఈనెల 12న సింధియా భోపాల్‌లో భాజపా తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. భాజపా.. జ్యోతిరాదిత్య సింధియాను రాజ్యసభకు పంపి.. కేంద్ర మంత్రి పదవి ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది.

వెంటనే 22 మంది...

సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన వెంటనే ఆయన వర్గానికి చెందిన మొత్తం 22 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి.. ఆ లేఖలను గవర్నర్‌కు ఈ-మెయిల్‌ చేశారు. తర్వాత ఆ లేఖలను భాజపా నేతలు మధ్యప్రదేశ్‌ స్పీకర్‌కు అందించారు. వాటిపై విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటానని సభాపతి చెప్పారు.

లెక్కల మాటేంటి..?

230 శాసనసభ స్థానాలు గల మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 114, భాజపాకు 107 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది. నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఇద్దరు బీఎస్పీ శాసనసభ్యులు, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఒకరు కమల్‌నాథ్‌ ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. సింధియా వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదం పొందితే కమల్‌నాథ్‌ సర్కార్‌ కొనసాగడం కష్టమే.

విశ్వప్రయత్నాలు...

తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్న కమల్ నాథ్ అసంతృప్తుల్ని బుజ్జగించేందుకు కేబినెట్‌ విస్తరణ అస్త్రం ప్రయోగించి విఫలమయ్యారు.

అసంతృప్తులకు అవకాశం కల్పించేందుకు 16 మంది మంత్రులతో సోమవారం రాజీనామా చేయించారు. ఈలోపు సింధియా వెళ్లి భాజపా అగ్రనాయకత్వాన్ని కలిశారు.

అటు దిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం కూడా సింధియాను బుజ్జగించే ప్రయత్నాలు చేసి విఫలమైంది. రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్.. సింధియాతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ సోనియాగాంధీతో సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. అనంతరం సింధియాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడం వల్లే సింధియాను బహిష్కరించినట్లు వేణుగోపాల్ చెప్పారు.

ఇదీ చూడండి: సింధియా అత్తలు చెప్పిన 'రాజమాత రక్తం' కథ ఇది...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.