జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోబాల్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబాతో సమావేశమయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. భద్రతకు సంబంధించిన మరికొందరు ఉన్నతాధికారులతోనూ గంటపాటు భేటీ అయ్యారు. జమ్ముకశ్మీర్లో తాజా పరిణామాలపై చర్చించినట్టు సమాచారం. మరికొన్ని కీలక అంశాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
భారీ బలగాల మోహరింపు, అమర్నాథ్ యాత్ర అర్థాంతరంగా నిలిపివేతతో జమ్ముకశ్మీర్లో రెండు రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికులు, పర్యటకులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇదీ చూడండి: ఆపరేషన్ కశ్మీర్: దిక్కుతోచని స్థితిలో స్థానికేతరులు