ప్రధాని మోదీ బయోపిక్.. 'పీఎం నరేంద్రమోదీ' విషయంలో ఎన్నికల సంఘం సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. ఈ సినిమా ధ్రువీకరణ స్థితి తెలియజేయాలని కోరింది.
మోదీ చిత్రాన్ని నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ కార్యకర్త వేసిన పిటిషన్‌ను ఇటీవల సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈసీని సంప్రదించాలని అత్యున్నత స్థానం పిటిషనర్‌కు సూచించింది. ఈ పరిణామం అనంతరమే సెన్సార్ బోర్డుకు ఈసీ లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సెన్సార్ బోర్డు మంగళవారం.. ఈ సినిమాకు 'క్లీన్ యూ' సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ విషయాన్ని సెన్సార్ బోర్డు ఈసీకి అధికారికంగా తెలియజేయాల్సి ఉంది.
వివేక్ ఒబెరాయ్ ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 11న విడుదల కానుంది.