కర్ణాటక హుబ్లీ జిల్లాకు చెందిన ఓ బాలుడి రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయాడు. మరొకరు అలా కాకూడదని శిరస్త్రాణాలను ఉచితంగా అందిస్తున్నాడు. హెల్మెట్ ధరించని కారణంగా తన తండ్రిలా ఇంకెవరూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందకూడదని వినూత్నంగా ఆలోచించాడు.
తండ్రి కర్మకాండల కార్యక్రమానికి విచ్చేసిన బంధువులు, ఇరుగుపొరుగు వారందరికీ ఉచితంగా హెల్మెట్ పంపిణీ చేశాడు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయాల్లో తప్పక ధరించాలని సూచిస్తున్నాడు.
బాలుడి తండ్రి కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. హెల్మెట్ ధరించనందున తలకు బలమైన గాయం తగిలి మృతి చెందాడు.
ఇదీ చూడండి: షోపియాన్ ప్రజలతో కలిసి భోంచేసిన ఢోబాల్