మధ్యప్రదేశ్లో 'గాడ్సే' గ్రంథాలయాన్ని ఆదివారం ప్రారంభించారు అఖిల భారత హిందూ మహాసభ సభ్యులు.
గ్వాలియర్లో ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయంలో దేశ విభజనకు సంబంధించిన సమగ్ర అంశాలు ఉంటాయన్నారు హిందూ మహాసభ ఉపాధ్యక్షుడు డాక్టర్ జైవీర్ భరద్వాజ్. వివిధ జాతీయ నాయకుల సమాచారం సహా.. ఇతర జ్ఞానాన్నీ సంపాదించుకోవచ్చని చెప్పారు.
"నేటి యువతరం సత్యాన్ని తెలుసుకుని, జాతీయవాదం పట్ల వారి బాధ్యతను నెరవేర్చాలని కోరుకుంటున్నాము. గాడ్సే.. దేశ విభజనను ఎందుకు వ్యతిరేకించారు? దానికి పర్యవసానంగా ఎందుకు ప్రతీకారం తీర్చుకున్నారు? వంటి విషయాలను తెలియజేసేందుకే ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాం."
- డాక్టర్ జైవీర్ భరద్వాజ్, హిందూ మహాసభ ఉపాధ్యక్షుడు
'అందుకే దేశ విభజన.!'
దేశ స్వేచ్ఛ కోసం.. హిందూ మహాసభ ఎన్నో త్యాగాలు చేసిందని ఈ సందర్భంగా చెప్పారు భరద్వాజ్. అయితే.. విభజనకు పూర్తి బాధ్యత కాంగ్రెస్దేనని అన్నారు. నెహ్రూ, జిన్నాను ప్రధాన మంత్రులను చేసేందుకే.. కాంగ్రెస్ దేశాన్ని విభజించిందని ఆయన ఆరోపించారు.
ఇదీ చదవండి: ఈ కైట్మ్యాన్ ఒంటి నిండా పతంగుల ఆభరణాలే