ETV Bharat / bharat

అక్కడ మళ్లీ రాత్రి కర్ఫ్యూ- విద్యాసంస్థలు బంద్​

author img

By

Published : Nov 23, 2020, 5:18 PM IST

దేశంలోని పలు ప్రధాన నగరాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలు అమలు చేస్తున్నాయి. 4 జిల్లాల్లో నవంబర్​ 24 నుంచి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు పేర్కొంది హిమాచల్​ ప్రదేశ్​ ప్రభుత్వం.

Himachal Pradesh govt imposes night curfew in Mandi, Shimla Kullu and Kangra, between November 24 & December 15;
అక్కడ మళ్లీ రాత్రి కర్ఫ్యూ- విద్యాసంస్థలు బంద్​

కరోనాపై పోరులో భాగంగా హిమాచల్​ ప్రదేశ్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్​ 24 నుంచి 4 జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ విధించనున్నట్లు స్పష్టం చేసింది.

ప్రభుత్వ విద్యాసంస్థలను డిసెంబర్​ 31 వరకు తెరవకూడదని కేబినెట్​ నిర్ణయించింది. నవంబర్​ 26 నుంచి ఆన్​లైన్​ తరగతులు నిర్వహించాలని.. ఉపాధ్యాయులు ఇంటి నుంచే పాఠాలు బోధించాలని పేర్కొంది.

క్లాస్​ 3, క్లాస్​ 4 ప్రభుత్వ ఉద్యోగులు.. 50 శాతం మంది మాత్రమే కార్యాలయాలకు రావాలని ఆదేశించింది.

కరోనా కట్టడిలో భాగంగా.. ఇటీవల గుజరాత్​ ప్రభుత్వం కూడా కఠిన నిబంధనలను అమలు చేసింది. కొవిడ్​ హాట్​స్పాట్​గా ఉన్న అహ్మదాబాద్​లో రాత్రి కర్ఫ్యూ విధించింది. దిల్లీలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించకుంటే.. రూ.2వేలు జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని రాష్ట్రాలూ.. ఇదే బాటలో పయనిస్తున్నాయి.

ఇదీ చూడండి: 'కరోనా కట్టడికి మీరు చేసిందేంటి?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.