ETV Bharat / bharat

27 రకాల పెస్టిసైడ్లపై నిషేధం.. రైతుల్లో భయం! - యాపిల్​ పంటలు

వ్యవసాయానికి వినియోగించే 27 రకాల పెస్టిసైడ్లపై కేంద్రం నిషేధం విధించనున్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ రైతుల్లో ఆందోళన నెలకొంది. అయితే వాటి నిషేధానికి ముందు చీడపీడలను నిర్మూలించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపించాలని కోరుతున్నారు అక్కడి రైతులు. మానవులు, పశువులపై ప్రతికూల ప్రభావం చూపిస్తోన్న నేపథ్యంలో ఆయా పెస్టిసైడ్లపై ఆంక్షలు విధించాలని యోచిస్తోంది కేంద్రం.

Himachal Pradesh: Farmers fear loss in income as govt plans to ban 27 pesticides
27 రకాల పెస్టిసైడ్లపై నిషేధం.. రైతుల్లో భయం!
author img

By

Published : Jun 6, 2020, 1:09 PM IST

27 రకాల పెస్టిసైడ్లపై నిషేధం

వ్యవసాయంలో వినియోగించే పెస్టిసైడ్లు మానవులు, జంతువులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. భారత్​లో వినియోగించే వాటిలో 27 రకాల పెస్టిసైడ్లు అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించింది కేంద్రం. వాటిని నిషేధించేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్రం నిర్ణయం హిమాచల్​ప్రదేశ్ రైతుల్లో ఆందోళనలకు కారణమైంది. పెస్టిసైడ్లు వినియోగించకపోతే వ్యవసాయంలో ఆదాయం తగ్గే ప్రమాదం ఉందని.. ఆయా రసాయనాల అమ్మకాలను నిలిపివేసేందుకు ముందే ప్రత్యామ్నాయ మార్గాలను చూపించాలని డిమాండ్ చేస్తున్నారు అక్కడి రైతులు.

"సేంద్రీయ వ్యవసాయం మా ఉత్పాదకతను తగ్గిస్తుంది. ఇదొక సమస్య. మరోవైపు కశ్మీర్లోని​ తోటలను పురుగు పాడు చేస్తుంది. మరి వీటిని పెస్టిసైడ్లు వినియోగించకుండా మేము ఎలా నియంత్రించగలం."

-డింపుల్ పంజాతా, ఔత్సాహిక ఉద్యాన రైతు

ప్రభుత్వం పెస్టిసైడ్ల వినియోగాన్ని తగ్గించాలనుకుంటే రైతులు, తోటమాలులకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాన్ని ముందే అన్వేషించాలన్నారు హిమాచల్ ప్రదేశ్​కు చెందిన ప్రేమ్ శర్మ అనే యాపిల్ తోట రైతు. లేదంటే పంటలు నాశనం అవుతాయన్నారు.

అయితే రైతుల అభిప్రాయాన్ని తోసిపుచ్చారు హిమాచల్ ప్రదేశ్ ఉద్యానశాఖ డైరెక్టర్ మదన్ మోహన్ శర్మ. వారికి అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయన్నారు.

"ప్రతి పంటకాలానికి నాలుగు రసాయన ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం నిర్దేశిస్తోంది. ఈ నేపథ్యంలో పెస్టిసైడ్లపై నిషేధం ఎక్కువమంది రైతులపై ప్రభావం చూపించదు. ఈ నాలుగింటిలో నుంచి ఏదైనా ఒకటి వారు ఎంపిక చేసుకోవచ్చు. ఈ నాలుగింటిలో ఏదైనా ఒకదానిపై నిషేధం విధించినా మిగతా మూడు అందుబాటులో ఉంటాయి."

-మదన్ మోహన్ శర్మ, ఉద్యాన శాఖ డైరెక్టర్, హిమాచల్ ప్రదేశ్

రసాయనాల వినియోగంపై అనుపమ్ వర్మ కమిటీ సూచించిన 66 రకాల పెస్టిసైడ్లలో 27 రకాలపై నిషేధం విధించనున్నట్లు మే 20న ప్రకటించింది కేంద్రం.

వివిధ దేశాల్లో నిషేధం, ఆంక్షలు విధించిన ఈ పెస్టిసైడ్లను భారత్​లో ఇంకా వినియోగిస్తున్నట్లు అనుపమ్​ వర్మ కమిటీ తేల్చింది.

అయితే నిషేధం విధించే పెస్టిసైడ్ల జాబితాలో యాపిల్​ సాగులో వినియోగించే కప్టాన్, కార్బన్​డాజిమ్, క్లోరోఫైరిఫోస్, బుటాచ్లర్, మాంకోజెబ్ ఎం-45, జినోమ్, జీరం, జినెబ్, థియోఫానేట్ మిథేల్, థీరం వంటివి ఉన్నాయి.

ఈ పెస్టిసైడ్లు, నీటి వనరులు, భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. తద్వారా మానవులు, జంతువుల్లో అనారోగ్యానికి కారణమవుతున్నట్లు.. ఫలదీకరణకు ఉపయోగపడే తేనేటీగలకు ప్రమాదకరంగా పరిణమిస్తున్నట్లు కమిటీ తేల్చింది.

అయితే ఈ రసాయన ఎరువులను నిషేధిస్తున్నట్లు ముసాయిదా గెజిట్​ను మాత్రమే కేంద్రం విడుదల చేసింది. ఈ నిషేధం వల్ల ప్రభావం పడే కంపెనీలు తమ అభ్యంతరాలను మే 14 నుంచి 45 రోజుల లోపు తెలపాలని కోరింది.

ఇదీ చూడండి:అమెరికాలో కూలిన విమానం- ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.