ETV Bharat / bharat

'మహా'లో కరోనా రికార్డు ఒక్కరోజే వెయ్యిమందికి వైరస్

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్రలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. ఇవాళ రికార్డు స్థాయిలో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 11,000 దాటింది. గుజరాత్​లో 326, దిల్లీలో 223, తమిళనాడులో 203 మందికి వైరస్​ సోకింది.

Highest one-day spike in coronavirus numbers in Maharashtra
మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో వెయ్యికి పైగా కరోనా కేసులు
author img

By

Published : May 1, 2020, 10:37 PM IST

Updated : May 1, 2020, 11:22 PM IST

దేశంలో కరోనా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 35,365మందికి వైరస్ సోకింది. 1152మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా మహారాష్ట్రలో వైరస్ కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో గుజరాత్, దిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు ఉన్నాయి.

'మహా'లో 24 గంటల్లో వెయ్యిమందికి పైగా..

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతి ఎక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,008 మందికి వైరస్​ సోకింది. రాష్ట్రంలో 11,506 మందికి వైరస్​ సోకినట్లు అధికారులు వెల్లడించారు. కొత్తగా మరో 26 మంది మరణించగా.. మొత్తంగా మృతుల సంఖ్య 485కి చేరింది. 1,773 మందికి వైరస్​ నయమైంది.

గుజరాత్​లో మరో 326 కేసులు

గుజరాత్​లో కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ మరో 326 మందికి వైరస్ పాజిటివ్​గా​ నిర్ధరణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 4,721కు చేరినట్లు అధికారులు తెలిపారు. తాజాగా 22 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు 236 మంది వైరస్​కు బలయ్యారు. 736 మంది ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు.

దిల్లీలో ఐదుగురు ఐటీబీపీ జవాన్లకు..

దిల్లీలో కరోనా బాధితుల సంఖ్య విస్తరిస్తోంది. ఐటీబీపీ(ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్) దళంలో కరోనా కలకలం రేగింది. ఐదుగురు జవాన్లకు వైరస్ సోకినట్లు​ నిర్ధరణ అయ్యింది. నేడు 223 మంది మహమ్మారి బారిన పడ్డారు. దిల్లీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,738 మందికి వైరస్ సోకగా.. 61 మంది మృతి చెందారు. మరో 1167 మంది మహమ్మారి బారిన పడి కోలుకున్నారు.

తమిళనాడులో మరో 203 మంది..

తమిళనాడులో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 203 మందికి వైరస్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. వైరస్ బాధితుల సంఖ్య 2,526కు చేరినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం వెల్లడించింది. మొత్తంగా 28 మంది మహమ్మారికి బలయ్యారు.

ఉత్తర్​ప్రదేశ్​లో 42 మంది మృతి..

ఉత్తరప్రదేశ్​లో ఇవాళ మరో 116 మంది మహమ్మారి బారినపడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,328 మందికి వైరస్​ సోకినట్లు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. మొత్తంగా 654 మంది డిశ్ఛార్జి​ అయ్యారు. మరో 42 మంది ప్రాణాలు కోల్పోయారు.

పంజాబ్​లో 100కు పైగా కేసులు

పంజాబ్​​లో నేడు మరో 105 వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 585 మంది ప్రాణాంతక వైరస్​ బారిన పడినట్లు రాష్ట్ర అధికారులు ప్రకటించారు. కొత్తగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. 108 మందికి వైరస్​ నయమైంది.

రాజస్థాన్​​లో మరో 33 కేసులు

రాజస్థాన్​లో కొత్తగా 55 వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా 2,617 మంది కరోనా​ బారినపడ్డారు. మరో ముగ్గురు మృతి చెందగా.. మరణాల సంఖ్య 61 కు పెరిగింది. 644 మందిలో వైరస్ నయమైంది.

కర్ణాటకలో 22 మంది మృతి..

కర్ణాటకలో తాజాగా మరో 24 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తంగా 589 మందికి వైరస్​ సోకినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 22 మంది మృతి చెందగా, 251 మంది ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.

  • ఒడిశాలో తాజాగా 5 కేసులు నమోదు కాగా... రాష్ట్రంలో వైరస్​ బారిన పడిన వారి సంఖ్య 147కు చేరుకుంది.
  • ఉత్తరాఖండ్​లో ఇప్పటి వరకు 57 మంది వైరస్​ బారిన పడ్డారు. 36 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.
  • జమ్ముకశ్మీర్​లో 581 మందికి వైరస్​ సోకింది. బిహార్​లో కరోనా బాధితుల సంఖ్య 403గా ఉంది.

Last Updated : May 1, 2020, 11:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.