ఓ ఏనుగుల గుంపు రహదారిపై చెరుకు లోడుతో వెళ్తున్న ఓ లారీని ఆపేశాయి. అందులోని చెరుకు గడలను ఎంచక్కా తినేశాయి. ఈ ఘటన కర్ణాటక-తమిళనాడు సరిహద్దులోని అసనూర్ ప్రాంతంలో జరిగింది. సంబంధిత దృశ్యాలను ఆ లారీ డ్రైవర్ తన చరవాణిలో బంధించాడు.
గజరాజులు చెరుకు తింటోంటే అడ్డగించకుండా వాహనంలోనే ఉండిపోయాడు డ్రైవర్. ఫలితంగా.. బెంగళూరు-దిండిగల్ జాతీయ రహదారిపై అరగంటకుపైగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కొంత చెరుకు తిన్న తర్వాత ఆ ఏనుగుల సమూహం అక్కడి నుంచి వెనుదిరిగింది.
![Herd of Elephant stopped the lorry and ate canes in Chamarajnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-cnr-03-lorry-av-7202614_30092020082536_3009f_1601434536_263_3009newsroom_1601440706_451.jpg)
ఇదీ చూడండి:భార్యను వేధిస్తున్న డిప్యూటీ కలెక్టర్ అరెస్ట్