ఝార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ముతో జేఎంఎం కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ సమావేశమయ్యారు. తాజా ఎన్నికల్లో జేఎంఎం నేతృత్వంలోని కూటమి గెలుపొందిన నేపథ్యంలో.. తమకు 50 మంది ఎమ్మెల్యేల మద్దుతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరారు.
ఏకగ్రీవ ఎన్నిక....
అంతకుముందు జేఎంఎం పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. హేమంత్ సోరెన్‌ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు.
ప్రమాణస్వీకారం....
డిసెంబర్ 29న మధ్యాహ్నం 1 గంటకు ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు జేఎంఎం పార్టీ ప్రధాన కార్యదర్శి సుప్రియో భట్టాచార్య తెలిపారు.
కూటమికి 47 స్థానాలు...
81 స్థానాలు ఉన్న ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-జేఎంఎం-ఆర్జేడీ కూటమి మొత్తం 47 (జేఎంఎం-30, కాంగ్రెస్-16, ఆర్జేడీ-1) స్థానాల్లో గెలుపొంది సాధారణ మెజార్టీ కన్నా 5 సీట్లు ఎక్కువ సాధించింది.
కాంగ్రెస్ నేతగా ఆలం..
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో నూతనంగా ఎన్నికైన శాసన సభ్యలు కలిసి ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా అలమ్‌గీర్ ఆలంను ఎన్నుకున్నారు.
ఇదీ చూడండి:రాహుల్‌కు ప్రశాంత్ కిషోర్ 'కృతజ్ఞతలు'